Monday, January 13, 2025

Happy Bhogi l – తెలుగులొగిళ్లలో భోగి వేడుకలు – పల్లె పల్లెలో పొంగల్ సంబురాలు

తెలుగులొగిళ్లలో భోగి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేస్తున్నారు ప్రజలు.. ఈ వేడుకల్లో పలు చోట్ల సినిమా స్టార్లు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు భాగస్వాములు అవుతున్నారు..

మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగిపండుగ ను తెలంగాణ , ఎపి లలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పల్లెల్లో పొంగల్‌ సందడి నెలకొన్నది. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. ఆడపడుచులు అందమైన ముగ్గులతో ఇంటి వాకిళ్లను అలంకరించారు. పోటీపడి ముగ్గులు వేశారు. వాటిలో గొబ్బెమ్మలను పెట్టారు. పిల్లలకు రేగిపండ్లతో స్నానాలు చేయిస్తున్నారు.

మరోవైపు ఉదయాన్నే భక్తులు ఆలయాలకు తరలివెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సంక్రాంతి కోసం హైదరాబాద్‌ వాసులు సొంతూళ్లకు తరలివెళ్లడంతో సందడి నెలకొన్నది. హరిదాసులతోపాటు అలంకరించిన డూడూ బసవన్నలు ఇంటింటికీ వెళ్తున్నాయి. రావమ్మా మహాలక్ష్మీ.. రావమ్మా.. అంటూ హరిదాసుల సంకీర్తనలు, పిల్లాపాపలు సల్లంగుండాలని డూడూ బసవన్నలు దీవిస్తున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement