తన బిడ్డను చూసేందుకు అత్తమామలు తీసుకొని వెళ్ళి తిరిగి ఇప్పటివరకు ఇవ్వలేదని, తన బిడ్డ ఆచూకీ కూడా తెలియడం లేదని, సయ్యద్ అజుమా అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. నెల్లూరు నగరంలోని గిరిజన భవన్ లో ఈ మేరకు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తనకు 6 సంవత్సరాల క్రిందట రావూరు గ్రామం, ఇందుకూరుపేట మండలం వాస్తవ్యుడు అయిన బాలబొమ్ము సురేష్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నానన్నారు. తమకు ఒక కుమారుడు అన్నారు. తన అత్త, ఆడపడుచు వేధింపులు పడలేక తాను నాలుగు నెలల క్రితం తన పుట్టింటికి వెళ్ళిపోయానని తెలిపారు. తాను పుట్టింటికి వెళ్ళిన కొద్ది రోజులకే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, అతని ఖర్మక్రియలకు బిడ్డ కావాలని చెప్పి తనబిడ్డను ఊరు పెద్దల సమక్షంలో తీసుకువెళ్ళి 4 నెలలు గడుస్తున్నా తన బిడ్డను తిరిగి ఇవ్వడంలేదన్నారు. బిడ్డ కోసం వెళితే ఇవ్వకుండా కొట్టి తరిమేశారన్నారు. తన బిడ్డను ఎమి చేశారో తెలియడం లేదన్నారు. తన బిడ్డను తనకు అప్పగించి, న్యాయం చేయాలని దిశ, ఇందుకూరుపేట పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసి నెలవుతున్నా ఫలితం లేదని కన్నీటిపర్యంతమయ్యారు.
ప్రజాసంఘాల ఐక్యవేదిక కో-కన్వీనర్ బీ యల్. శేఖర్ మాట్లాడుతూ… బాధితురాలు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని, దీనికి నిరసనగా రేపు ఇందుకూరుపేట పోలీస్టేషన్ ఎదుట బాధితురాలితో కలిసి ధర్నా చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక కో-కన్వీనర్ బీఎల్ శేఖర్, ఉష, షాహుల్, జిలానీ, జీనా, ఆయేషా, రుక్షానా పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital