Monday, January 6, 2025

AP | హంపి విజయం తెలుగుజాతికి గర్వకారణం.. శాప్ చైర్మన్ రవినాయుడు

  • క్రీడాభివృద్ధికి సూచనలు, సలహాలు ఆహ్వానం..
  • శాప్ నుంచి హంపికి పూర్తి సహకారం..
  • హంపిని కలిసి ప్రత్యేకంగా అభినందించిన రవి నాయుడు..


(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : వరల్డ్ రాపిడ్ చెస్ పోటీల్లో ఛాంపియన్ గా నిలిచిన కోనేరు హంపి తెలుగుజాతికి గర్వకారణమని, ఆమె గెలుపు తెలుగుజాతి కీర్తిని ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేసేలా చేసిందని శాప్ చైర్మన్ రవి నాయుడు పేర్కొన్నారు. వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఉమెన్ ఛాంపియన్ గా నిలిచిన కోనేరు హంపికి ఘనస్వాగతం పలికి విజయవాడలోని ఆమె నివాసంలో శాప్ చైర్మన్ రవి నాయుడు శనివారం ప్రత్యేకంగా కలిసి కోనేరు హంపిని అభినందించారు.

ఈ విజయంతో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ స్పోర్ట్స్ పాలసీని హంపికి వివరించారు. హంపికి ఎల్లవేళలా శాప్ నుండి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని తాను కలుస్తున్నట్లు షాప్ చైర్మన్ కు కోనేరు హంపి ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement