టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి తమ నిరసన వ్యక్త పరిచారు. ఈ సందర్భంగా పలమనేరు పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు గ్యాస్ నాగరాజులు ప్రసంగించారు. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
రాజకీయ కక్ష్య ధోరణితో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేయించి పైశాచికానందాన్ని పొందుతున్నారన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన బాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు ఆర్బిసి కుట్టి, ఖాజాపిర్, జగదీష్ నాయుడు, మదన్, శ్రీధర్, హనీఫ్, సుధాకర్, సుబ్బు, బాబాజాన్, అస్లాం, సాదిక్, సురేష్, గంగవరం మండల నాయకులు చిట్టిబాబు, రహీమ్, గిరిధర్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు.