ఏపీలో రేపటి నుంచి (మార్చి 18) ఒంటిపూట తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ సూచనల మేరకు 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, అన్‌ఎయిడెడ్, మెడల్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న బడుల్లో పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఒంటిపూట బడుల సమయంలో మధ్యాహ్నం భోజనం తర్వాతే విద్యార్థులను ఇంటికి పంపాలని అధికారులు ఆదేశించారు.