రాజంపేట, ప్రభ న్యూస్: జీ వీ ఫుట్‌బాల్ యాప్ ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడ విన్నా ఈ గోల్‌మాల్ డూప్లికేట్ యాప్ గురించి, యాప్ వల్ల నష్ట పోయిన బాధితుల గురించి, బాధితులు పోగొట్టు-కున్న డబ్బుల గురించి ఒకటే చర్చ. అన్నమయ్య జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో కూడా ఈ యాప్ బాధితులు భారీగానే ఉన్నారు. సామాన్యతులతో పాటు- నష్ట పోయిన వారిలో సచివా లయ సిబ్బంది అధికంగా ఉన్నారనే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాలో చాలామంది పోలీసులు కూడా ఈ యాప్ బారిన పడి భారీగా నష్టపోయారని వార్తలు వ్యాపిస్తుండడంతో, ఇక ఏం చేయాలో అర్థంకాక బాధితులు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభు త్వ ఉద్యోగులు కావడం, ఇలా అనుమతులు లేని యాప్ లలో అత్యాశతో డబ్బులు పెట్టి , ఒకటికి రెండు రెట్లు- ఆదాయం లభిస్తుందని నకిలీ యాప్‌ని నమ్మి మోసపోవడంతో పరువు పోతుందని చాలామంది ఉద్యోగులు లోపల మదనపడుతున్నారు. రాజాంపేట లో ఒక సచివాలయ ఉద్యోగి తన పరిచయాలతో అధిక శాతం సచివాలయ ఉద్యోగులను ఈ యాప్‌ల లో పెట్టు-బడి పెట్టించారని ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఈ యాప్ ప్రచారం కోసం పెట్టు-బడులను ఆకర్షిం చేందుకు ఈ సచివాలయ ఉద్యోగి రాజంపేట బైపాస్ నందు గల బిర్యాని సెంటర్లో పార్టీలు ఇవ్వడం కూడా జరిగిందని, ఇలా అత్యాశతో లింక్ సిస్టమ్ తో అసలు ఆనవాళ్లే లేని యాప్‌ని సృష్టించి ఘరానా మోసగాళ్లు కోట్ల రూపాయల సొమ్మును కాజేస్తే, వాళ్లని నమ్మి ఆదాయం వస్తుందని ఆశతో పాటు-, లింక్ సిస్టం ద్వారా సభ్యులను చేర్పిస్తే కమిషన్ వస్తుందనే కక్కుర్తి తో , ముందు వెనుక చూడకుండా అందరూ పెట్టు-బడులు పెట్టి నిండా మునిగిపోయారని, ప్రస్తుతం ఈ యాప్ పనిచేయకపోవడంతో తమ కష్టార్జితం అత్యాశకు ఆహుతైందని పలువురు ఉద్యోగులు చర్చించుకుంటు-న్నారు.
రాజంపేట పట్టణంలోనే ఈ యాప్ వల్ల దాదాపు 30 నుండి 40 లక్షల రూపాయలు బాధితులు కోల్పోయారనే సమాచారం తో పాటు- , అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయలు బాధితులు కోల్పో యారు అని సమాచారం. ప్రోత్సహించింది ప్రభుత్వ అధికారులే,,,,జీవీ ఫుట్బాల్ యాప్ ఎక్కడ పుట్టిందో, ఎవరికి పుట్టిందో తెలియదు కానీ, ఈ యాప్ ను మాత్రం ప్రోత్సహించింది కొందరు ప్రభుత్వ అధికా రులే. యాప్ లో చేరిన మొదట్లో భారీగా ఆదాయ ఆశ చూపి, ఒక గ్రూపుగా తయారు చేయించి , ఒక్కొక్క గ్రూపులో ఎంతమందిని చేర్పిస్తే అంత ఆదాయం వస్తుందంటూ ప్రచారం చేసి, మొదట్లో వారికి పార్టీ లు, బహుమతులు అందిస్తూ భారీగా పెట్టు-బడి పెట్టిన వెంటనే ఈ యాప్ కార్యకలాపాలు ఆగి పోవడంతో చాలామంది భారీగా నష్టపోయారు కానీ, ఈ నష్టానికి ప్రదాన సూత్రధారులు మాత్రం ఉన్నత విద్య కలిగిన కొందరు అధికారులు అనేది మాత్రం సత్యం. అత్యాశ కు పోయి కొందరు అధికారులు వెనకా ముందు చూసుకోకుండా ఈ యాప్ ను జనాల్లోకి తీసుకు వెళ్లడంతో వారితోపాటు- అందరూ బాధితులు ప్రస్తు తం ఏం చేయాలో అర్థం కాక కుమిలిపోతున్నారు. ఏమైనా అత్యాశకు పోతే ఇలాగే జరుగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.