తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్): ఏపీలోని తిరుపతి నగరంలోని కొర్లగుంట. అశోక్ నగర్ రాయలసీమ పబ్లిక్ స్కూల్ ఎదురుగా గల ఇంట్లో లో నిషేధిత గుట్కా లు నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ సూపర్డెంట్ డాక్టర్ స్వాతి శుక్రవారం తన సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. నిషేధిత గుట్కా లను నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో నిల్వ ఉంచారు. విమల్ 72 బ్యాగులు. హాన్స్ 34 గోతాలు. వితోబాకో. 37 గోతాలు. స్వాగత్ గోల్డ్ టా బాకో. రెండు గోతాలు.. చైనీస్ రెండు గోతాలు. ఎం. సెంటేండ్. టో బొ కో 8 బాక్సులు.
వీటి విలువ 28.77.936లుగా ఉంటుందని అధికారులు తెలియజేశారు. అయితే మార్కెట్ విలువ దాదాపు లక్షకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ దాడుల్లో అసిస్టెంట్ ఎన్ ఫోర్స్ మెంట్ సూపర్డెంట్ శ్రీనివాస రావు, తిరుపతి అర్బన్ ఇన్స్పెక్టర్ కే. సుబ్రహ్మణ్యం. డి .టి .ఎఫ్. ఇన్స్పెక్టర్ వై. హేమంత్ కుమార్ పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..