Monday, January 6, 2025

KNL | రోడ్డెక్కిన గురుకులం విద్యార్థులు

కర్నూల్ బ్యూరో : ఎమ్మిగనూరు పరిధిలోని బనవాసి గురుకుల బాలికల కళాశాల విద్యార్థులు గురువారం నిరసనకు దిగారు. విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన లైబ్రేరియన్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.

విద్యార్థి సంఘాల నాయకులు శేఖర్, సురేంద్ర మాట్లాడుతూ.. ఈ ఘటనపై సీఎం, జిల్లా మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. లైబ్రేరియన్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసందర్భంగా ఉద్రిక్త‌ పరిస్థితులు నెలకొన్నాయి. రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు విద్యార్థి సంఘం నేతలను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement