కర్నూలు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. హోళగుంద మండలం సమ్మతగేరి గ్రామ సమీపంలో కొండపై గల రాజుల కాలం నాటి కట్టడాల వద్ద కొందరు దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. 15 రోజుల్లో రెండుసార్లు కొండపై గుప్త నిధులు తవ్వకాలు జరిపారు. రాతి బండల మధ్య ఉన్న పాము పుట్టకు పూజలు చేసి దుండగులు తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
Kurnool: గుప్తనిధుల కోసం తవ్వకాలు.. పాము పుట్టకు పూజలు
Advertisement
తాజా వార్తలు
Advertisement