Sunday, January 19, 2025

Gunturuలో కోకైన్ కలకలం – ముగ్గురు అరెస్ట్

ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభబ్యూరో గుంటూరు నగరంలో కోకైన్ కలకలం రేపుతోంది. గతంలో రాజధాని ప్రాంతంలో లిక్విడ్ గంజాయి, గంజాయి చాక్లెట్లు ఆందోళన కలిగించగా తాజాగా రాష్ట్రంలోనే తొలిసారి గుంటూరు నగరంలో కొకైన్ పట్టుబడటం మాదకద్రవ్యాలకు కేంద్రంగా మారిందన్న ఆందోళన కలిగిస్తోంది.

నగరంలోని శ్యామల నగర్ ప్రాంతంలో 8.5 గ్రాముల కోకైన్ ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.రాష్ట్రంలో తొలి కోకైన్ కేసుగా నమోదు చేసినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. ఇందుకు సంబంధించి విక్రయాలు జిల్లాలో ఇంకా ఎక్కడైనా జరిగాయా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లు తెలిపారు.

గుంటూరు నగరంలో ఒక్క గ్రామ్ కోకైన్ 6 వేల నుంచి 3 వేల రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నగరంలోనినల్లచెరువు కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటువంటి మాదక ద్రవ్యాలను అమ్మకాలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. 7 ప్యాకేట్లల్లో ఉన్నటువంటి 8.5 గ్రాముల కోకైన్ ను సీజ్ చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎక్సైజ్ బీసీ శ్రీనివాసులు మాట్లాడుతూగంజాయి మాదక ద్రవ్యాలకు సంబంధించిన వివరాలు 14500 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. గుంటూరు పల్నాటి జిల్లాలపై నిరంతర నిఘాకొనసాగుతుందని మాదకద్రవ్యాలు విక్రయించిన వినియోగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement