Wednesday, November 20, 2024

రైతుల ఖాతాల్లో రూ.128 కోట్ల సున్నా వడ్డీ రాయితీ నగదు…. జగన్

అమరావతి : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి అడుగులోనూ రైతు శ్రేయస్సే కనిపిస్తుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. రైతులు, రైతు కూలీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 2019-20 రబీ సీజన్‌లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం వడ్డీ రాయితీ ని జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రూ.128.47 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా జిల్లాల్లోని రైతులతో మాట్లాడుతూ, రైతు బిడ్డగా ఈ 22 నెలల పాలనలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామని చెప్పారు.గత ప్రభుత్వ బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించిందని గుర్తు చేశారు. పంటకు గిట్టు బాటు ధర రాకుంటే ప్రభుత్వమే దగ్గరుండి కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఏ మంచి జరగాలన్నా ఈ–క్రాప్‌ మంచిదని రైతులు గుర్తు పెట్టుకోవాలని జగన్‌ సూచించారు. రైతులకు మంచి జరగాలని వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement