అమరావతి, : సంక్షేమ పథకాల అమలులో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు సంక్షేమ పథకాల అమలుపై పలు రాష్టాల మంత్రులు, అధికారులు అధ్యయనం చేసి ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ నేపధ్యంలోనే సీఎం జగన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు సంక్షేమం అందిస్తూ.. ఆయన ముందుకు సాగుతున్న తీరుకు ప్రశంసలు లభిస్తున్నాయి. కాగా ముఖ్యమంత్రి చాలా ఎమోషనల్ పర్సన్ అని ఆయనకు దగ్గరగా మెలిగేవాళ్లు చెప్పే మాట. తాజాగా తన మంచి మనసును మరోసారి చాటు-కున్నారు సీఎం జగన్. బీమా లేకున్నా, పెద్ద మనసుతో కుటుంబ పెద్దను కోల్పోయిన 12,039 కుటుంబాలకు ఏప్రిల్ 6న ప్రభుత్వ నిధుల నుంచి 258 కోట్లు- ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. వైఎస్సార్ బీమా పథకానికి అర్హత ఉండి, దాని పరిధిలో రాకుండానే మరణించిన వారి కుటు-ంబాలను కూడా ఆదుకోవాలని జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం బీమా వర్తించడానికి అవకాశంలేని ఈ కుటుంబాలకు కూడా భరోసా కల్పించేందుకు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తం 12,039 కుటుంబాలకు భరోసా కల్పించినట్లవుతుందని అధికారులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో నూతన విధి విధానాలతో ముఖ్యమంత్రి జగన్ గత 2020 అక్టోబరు 21న వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించారు. అంతకుముందు.. అమలులో ఉన్న బీమా పథకానికి కేంద్ర ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయం ఆపివేయడంతో ఈ పథకానికి అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ పేదలకు ఉచిత బీమాను అందజేస్తోంది. దీని ద్వారా సాధా రణ, ప్రమాదవశాత్తు మరణించిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోం ది. పథకం ప్రారంభమైన తేదీ తర్వాత ఈ పథకానికి అర్హత ఉండి, నిబంధనల ప్రకారం బీమా పరిధిలోకి రాకుండానే.. ఇప్పటివరకు 11,022 మంది సాధారణ పరిస్థితులతో మృతిచెందినట్లు, మరో 1,017 మంది ప్రమాదవశాత్తు చనిపోవడం లేదా శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారని అధికారులు గుర్తించారు.
12,039 కుటు-ంబాలకు రూ.258 కోట్లు- సాయం
వైఎస్సార్ బీమా పథకంలో పేర్లు నమోదైన ఒకొక్కరి తరఫున ఆయా బ్యాంకులకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ఏపీ సర్కార్ చెల్లించింది. అయితే, బ్యాంకుల్లో నమోదు ప్రక్రియ పూర్తికాకుండా ఇందుకు అర్హత ఉన్నవారు మొత్తం 12,039 మంది చనిపోయారు. వీరు సంబంధిత బీమా సంస్థలు, బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం పొందే వీలులేని జాబితాలో ఉండిపోయారు. దీంతో సీఎం జగన్ వీరిపట్ల ఉదారంగా వ్యవహరించి వారి ఫ్యామిలీలను ఆదుకునేందుకు నిర్ణయించారు. వీరికి ప్రత్యేకంగా ప్రభుత్వ నిధులు నుంచి ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.కాగా, ఈ 12,039 కుటుంబాలకు రాష్ట్ర
ప్రభుత్వం రూ.258 కోట్లు- ఖర్చు చేయనున్నట్లు- గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ బీమా పథకం లబ్దిదారులకు ఏప్రిల్ 6న సీఎం జగన్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు-చేస్తున్నారు. 12,039 కుటు-ంబాలకు ఆ రోజున రూ.258 కోట్ల ఆర్థిక సహాయం అందజేయనున్నారు.
బీమా లేకున్నా ఎపిలో ఆర్థిక భరోసా..
Advertisement
తాజా వార్తలు
Advertisement