అమరావతి – టిటిడి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లు తిరుపతి లోక్ సభ వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరుస్తూ టీడీపీ సోషల్ మీడియా పోస్టింగ్ లు చేసిందని వైసిపి రాష్ట్ర డిజిపికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.. దళితులను అవమానించినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, సైబర్ చట్టాల కింద చర్యలు తీసుకోవాలని వైసిపి ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు కైలే అనిల్, మేరుగ నాగార్జునలు ఈ మేరకు డిజిపికి లేఖ అందించారు.. దీనిపై అమరావతతిలో నందిగం సురేష్ బాబు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ వాఖ్యలు, సోషల్ మీడియా పోస్టింగ్ లపై డీజీపీకి ఫిర్యాదు చేశామని అన్నారు. దళితుడైన తమ అభ్యర్థిని కించపరుస్తూ టీడీపీ అధికారిక ఖాతా నుంచి పోస్టింగ్ లు పెడుతున్నారని అన్నారు. ఈ పోస్టింగులు కచ్చితంగా ఎట్రాసిటీ కిందకి వస్తాయని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశామని అన్నారు. చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచీ దళితులంటే చిన్న చూపేనని, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న వ్యక్తి ఆయన అని విమర్శించారు. దళితుల భూములను కొట్టేసిన వ్యక్తి చంద్రబాబు, ఆయన ఎన్ని కుట్రలు చేసినా ఎంత అవమానించినా మా గురుమూర్తి భారీ మెజారిటీ తో గెలుస్తారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ లపై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని వారు కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement