తెనాలి, ఫిబ్రవరి 19 ప్రభ న్యూస్ : రాజ్యసభ మాజీ సభ్యులు దివంగత నేత యడ్లపాటి వెంకట్రావు ప్రథమ వర్ధంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని ఆయన నివాసగృహంలో యడ్లపాటి చిత్రపటానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమ, పలువురు టీడీపీ నాయకులు, వైసిపి నాయకులు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాజకీయాల్లో అజాతశత్రువుగా యడ్లపాటి వెంకట్రావు అందించిన సేవలను కొనియాడారు. రాజకీయంగా ఎటువంటి పదవి చేపట్టినా నిజాయితీ, నిబద్ధతతో పని చేసేవారని కొనియాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కందుల వేణు వర్ధన్ యడ్లపాటి చిత్రపటానికి నివాళులర్పించారు.
ఎడ్లపాటి వెంకట్రావు వర్ధంతి సందర్భంగా పేదలకు ఉచిత వైద్య సేవలు
రాజ్యసభ మాజీ సభ్యుడు దివంగత ఎడ్లపాటి వెంకట్రావు ప్రధమ వర్ధంతి ని పురస్కరించుకొని వెంకట్రావు నివాసంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించారు. పట్టణానికి చెందిన మెడ్ స్టార్ హాస్పిటల్ వైద్య సిబ్బంది ప్రజలకు వైద్య పరీక్షలు చేసి అవసరం మేరకు ఉచిత మందులు అందజేశారు. వైద్య శిబిరంలో గుండె, ఊపిరి తిత్తులు, నరములు, వెన్నెముక,కిడ్నీ వంటి కీలక విభాగాలను వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరానికి 500ల సంఖ్యలో ప్రజానీకం హాజరై వైద్య సేవలను పొందారు. మెగాస్టార్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బి విజయ్ చైతన్య , డాక్టర్ ఎల్ ముఖేష్ గౌతమ్ , డాక్టర్ ఉదయ్ కిరణ్ లు సిబ్బంది వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైసిపి శ్రేణులు, ఎడ్లపాటి వెంకట్రావు అభిమానులు రాజకీయాలకతీతంగా పాల్గొన్నారు.