Tuesday, November 26, 2024

ఎపిలో మందు బాబుల హుషార్ – నారా లోకేష్ ప‌రేషాన్…

అమ‌రావ‌తి – ఎపిలో మందు బాబులు పండుగ చేసుకుంటున్నారు… ఉద‌యం 11 త‌ర్వాత గాని తెర‌చుకోని మద్యం షాపులు తెల్లార‌క‌ముందే ఆరు గంట‌ల‌కే ఓపెన్ కావ‌డంతో నిషాతో ఊగిపోతున్నారు…. ఎపిలో నేటి నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి క‌ర్ఫ్యూ అంక్ష‌లు కొన‌సాగ‌తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం మ‌ద్యం షాపుల‌ను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మద్యం దుకాణాలు తెరచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉద‌యాన్ని మ‌ద్యం షాపులు తీయ‌డంతో బెడ్ టీ తాగే మందుబాబులు మ‌ద్యం షాపులు వ‌ద్దే బెడ్ మ‌ద్యం కొట్టేస్తున్నారు… ఎపిలోని అనేక ప్రాంతాల‌లో మ‌ద్యం షాపుల వ‌ద్ద బారీ క్యూలు కూడా క‌నిపిస్తున్నాయి…. కాగా, ఎపిలోని అన్ని మ‌ద్యం షాపుల‌ను ప్ర‌భుత్వ‌మే త‌న బేవ‌రేజ్ కార్పొరేష‌న్ ద్వారా నిర్వ‌హిస్తున్నది… కాగా, సూర్యుడు రాక‌ముందే మ‌ద్యం షాపులు తెరిచేందుకు అనుమ‌తించిన ప్ర‌భుత్వంపై టిడిపి జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా మండి ప‌డ్డారు.. “ద‌శ‌ల‌వారీ మ‌ద్య‌నిషేధం చేస్తామంటిరి క‌దా @ysjagan గారు.. దశ‌ల‌వారీగా మ‌ద్యం అమ్మ‌కం వేళ‌లు మారుస్తూ.. తెల్లారి పాల ప్యాకెట్లు అమ్మే స‌మ‌యానికి ముందే మ‌ద్యం షాపులు తెరిచి ఏం సందేశం ఇస్తున్నారు? క‌రోనా మందుల్లేక ప్రాణాలు పోతున్నాయంటే, నా సొంత బ్రాండ్ మందు ప్రెసిడెంట్ మెడ‌ల్‌ తాగమంటున్న‌ట్టుంది మీ ఎవ్వారం. బెడ్లు,ఆక్సిజన్,వ్యాక్సినేషన్ గాలికొదిలేసి లిక్కర్ షాపులు 6 గంటలకే తెరిచి ప్రజల్ని దోపిడీ చెయ్యడానికి ప్రభుత్వం పరితపించడం దారుణం “అంటూ నారా లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement