అమరావతి, రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా పనిచేస్తూ దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తోన్న వాలంటీ-రు వ్యవస్థకు తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా మరో తీపికబురు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రామాలు,పట్టణాల్లో పెన్షన్ , రేషన్ పంపిణీతో పేస్టు ముఖ్యంగా కరోనా వ్యాప్తి సమయంలో వారి సేవలు అభినందనీయం. ఇప్పటికే ఉత్తమ పనితీరు కన బర్చిన వాలంటీ-ర్లను ఉగాది రోజున సత్కరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరో శుభవార్త అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు- సమాచారం. అర్హులైన వాలంటీ-ర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత శాతం రిజర్వేషన్ కల్పించే విషయంపై అధికా రులు కసరత్తు చేస్తున్నట్లు- తెలుస్తోంది. అదే విధంగా ప్రస్తుతం ఉన్న వేతనాన్ని పెంచాలని కూడా సర్కారు యోచిస్తోంది. అలాగే వాలంటీ-ర్లకు ఇంసెంటివ్ ఇవ్వాలనే తలంపు కూడా ఉన్నట్లు- తెలుస్తోంది. గత సంవత్సర కాలంగా సేవలందిస్తున్న వీరు తాము తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామనే అసంతృప్తితో వున్నారు. జనవరి నుంచి ప్రభుత్వం నూతనంగా మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ వ్యవస్థకు నాంది పలికింది. వాహ నాల నిర్వాహకులు, సహాయకులకు 15 వేలు వేత నం ప్రకటించారు. అయితే వారం రోజుల లోపే వారు ఈ వేతనానిని తాము పనిచేయలేమని చేతులెత్తేశారు. దీంతో ప్రభుత్వం తక్షణమే వారికి మరో ఐదు వేలు పెంచి 21 వేలు చేశారు. దీంతో సంవ త్సరం కాలంగా కేవలం 5వేల వేతనంతో పనిచేస్తు న్న తమను ప్రభుత్వం పట్టించుకోలేదని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగడం జరిగింది. ిఊహించని హఠాత్పరిణా మానికి ప్రభు త్వం సైతం ఖంగుతింది. దీంతో సీఎం జగన్ రంగం లోకి దిగి బహిరంగ లేఖ రాసి వారి అసంతృప్తిని తాత్కాలికంగా చల్లార్చారు. ఆ సమయంలోనే వాలంటీ-ర్లకు ఎదో విధంగా లబ్ది చేకూర్చాలని ముఖ్యమంత్రి జగన్ ఆలోచించినట్లు- సమాచారం. ఈ తరుణంలోనే ఉగాది రోజు వారందరికీ అవార్డులతో పాటు- మరో తీపికబురు అందించాలని సర్కారు సమాయత్తమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వాలంటీర్లకు రిజర్వేషన్
By sree nivas
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement