కర్లపాలెం – జడలు… జడలు పూలజడలు.. ఎటు చూసినా మల్లెల ఘుమ ఘుమలు… సుమ సౌరభాల వసంతాన వనితల వయ్యారం .. చిన్నారుల సింగారం.. మల్లెపూల సీజన్లో ఇది ఒక తియ్యటి అనుభూతి. పూల జడలు సింగారించుకోవడం అనాదిగా వస్తున్న ఒక ఆనవాయితీ..
.మహిళల మనసుని దోచే మల్లె పూల జడల సింగారం ఈ సీజన్లో కనిపించే ఒక అద్భుతమైన అలంకారం .. అందమైన పూల జడలు సింగారించుకొని ముచ్చట పడటం ,ఫోటోలు దిగటం ఒక తియ్యటి అనుభూతిగా భావిస్తుంటారు. మల్లెపూల కున్న ప్రాధాన్యతను ఎంతో గొప్పగా చెబుతారు. ఈ సీజన్లో అయితే అన్ని శుభకార్యాల్లో మల్లెపూలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ముఖ్యంగా మల్లె పూల జడలు నిత్యం మనకు ఈ సీజన్లో దర్శనమిస్తుంటాయి. వంకుల జడ , చక్రాలజడ ఇలా రకరకాల జడలు ఆకర్షిస్తుంటాయి. చిన్నారులకు వివిధ రకాల మల్లె పూల జడలు ఆకట్టుకుంటాయి. ఒక అందమైన పూలజడ సింగారించాలంటే 2 నుంచి 3 గంటల వరకు సమయం పడుతుంది. మధ్యాహ్నం వేళల్లో ఇదొక ప్రత్యేకమైన కార్యక్రమం గా పెట్టుకొని మహిళలు పూల జడల పొందికలో నిమగ్నం అవుతుంటారు. తమ పిల్లలకు అందంగా పూలజడల తో తీర్చిదిద్దటంలో పోటీలు పడుతుంటారు .మల్లె పూల ధరలు అందుబాటులో ఉంటే ఈ పూలజడ లకు మరింత ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది . మల్లెపూల ధర తగ్గే కొద్దీ పూల జడలు సంఖ్య పెరుగుతూ వస్తుంది. సాయం సంధ్య వేళ పూల జడలు సింగారించుకొని ఫోటోలు దిగుతుంటారు. బాపట్ల ప్రాంతంలో మల్లె పూల తోటలు విస్తారంగా సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో మల్లె పూల ధరలు అందుబాటులో ఉండటంతో చాలామంది ఈ మల్లెపూల జడల మీద ఆసక్తి కనబరుస్తుంటారు.
అందమైన అలంకారం.. పూలజడల సింగారం..
Advertisement
తాజా వార్తలు
Advertisement