Friday, November 22, 2024

వైభవోపేతంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

గుంటూరు కల్చరల్, – గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కంచి కామకోటి పీఠ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ 22 వ వార్షిక బ్రహ్మోత్సవాలు గోవిందా… గోవిందా అంటూ అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. స్థానిక బృందావన్ గార్డెన్స్ గుంటూరు తిరుపతి గా ప్రసిద్ధి చెందిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ 22 వ వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీసరస్వతి స్వామి, శ్రీజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి స్మరణలతో, శ్రీసరస్వతి శంకరాచార్య స్వామి ఆశీస్సులతో మంగళవారం ఆలయ పాలక మండలి సభ్యులు, భక్తుల సమక్షంలో ఏ,యెన్.వీ. నృసింహాచార్యుల వారి ప్రధాన అర్చకత్వమున, ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. స్వాగతాంజలి, నాదస్వరం , శ్రీవిష్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం , అజస్ర దీపారాధన, దీక్షాధారణ , రుత్విగ్వరణ, వాస్తు పూజ , అగ్ని ప్రతిష్టాపన, గరుడ ఆరాధన, ధ్వజారోహణ, నీరాజనం, మంత్రపుష్పం, తీర్ధ ప్రసాద వినియోగం తో మొదటి రోజు కార్యక్రమాలు ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఉపన్యాస కార్యక్రమంలో గుంటూరు చిన్మయ మిషన్ సువీరానందస్వామి బ్రహ్మోత్సవ విశేషాలను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ కాసరనేని సదాశివరావు కళాసమితి ఛైర్మన్ డాక్టర్ యర్రా నాగేశ్వరరావు, సంఘ సేవా తత్పరులు నూతలపాటి తిరుపతయ్య ముఖ్య అతిథులుగా, ఉపన్యాసకులుగా డాక్టర్ ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి ఉపన్యాసకులుగా, ఆధ్యాత్మిక వేత్త కైలాసనాధ్ పాల్గొని స్వామివారి మహత్యాన్ని , బ్రహ్మోత్సవాలలో లోని అంతరార్ధాలను వివరించారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సి. హెచ్. మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయాలు వర్గ సభ్యలు కోవిడ్ – 19 నియమ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement