అమరావతి, : కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని (టీకా మహో త్సవం) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రోజుకు 5 నుంచి 6 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. అయితే అందుకు తగినంత వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో అనేక వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఉత్సవాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. సోమవారం పలు కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల్లో తగి నంత నిల్వలు లేక అనేక మంది వెనుదిరగాల్సి వచ్చింది. అయితే సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఎట్టకేలకు స్పందించిన కేంద్రం.. 4.40 లక్షల వ్యాక్సినేషన్‌ను రాష్ట్రానికి పంపింది. ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 1.80 లక్షల వ్యాక్సినేషన్ తో కలిపి 6.20 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌గా తీసుకుని ఈ నెల 11వ తేదీ నుంచి రాష్ట్రంలో నిర్వహిస్తున్న కరోనా ఉత్సవాలకు రోజుకు 5 నుంచి 6 లక్షల డోసుల అవసరం ఉంది. నాలుగు రోజులపాటు జరిగే పై కార్యక్రమానికి సుమారు 25 లక్షల డోసులు కావాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పాత, కొత్త నిల్వలతో కలిపితే 6 లక్షల 20 వేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మంగళవారం రాత్రి లోపు మరో 2 లక్షల డోసులు వచ్చే అవకాశం ఉందని కేంద్రం నుంచి రాష్ట్రానికి సమాచారం అందింది. బుధవారంతో ముగిసే ఈ కార్యక్రమానికి మరో 10 లక్షలకు పైగా డోసుల అవసరం ఉంది. కేంద్రం నుంచి ఆ దిశగా కోవిడ్ వ్యాక్సిన్ రాష్ట్రానికి సరఫరా చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఉత్సవాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తగిన నిల్వలు లేక..
పలు కేంద్రాల్లో ఉత్సవాలకు బ్రేక్
రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్ ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 25 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ను అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అం దుకోసం అవసరమైన వ్యాక్సిన్ నిల్వలను రాష్ట్రానికి సరఫరా చేయాలని ఆయన గత 3 రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. అయితే టీకా ఉత్సవం ప్రారంభమైన రోజు 2 లక్షలు మాత్రమే కేంద్రం నుంచి రాష్ట్రానికి చేరాయి. దీంతో మరోసారి సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో సోమవారం మరో 4.40 లక్షల డోసులు రాష్ట్రానికి వచ్చాయి. అయితే టీకా ఉత్సవాలు ప్రారంభానికి ముందు రోజుకు 70 నుంచి 80 వేల మందికి టీకా అందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఉత్సవాల సందర్భంగా రోజుకు 5 నుంచి 6 లక్షల మందికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ తగినన్ని నిల్వలు లేక ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి. ఫలితంగా సోమవారం పలు కేంద్రాలలో ఉత్సవాలకు బ్రేక్ కూడా పడింది.
ఇప్పటివరకు రాష్ట్రానికి 42.57 లక్షల డోసులు
వైద్య నిపుణులు కోవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి తెచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి 42.57 లక్షల డోసులు కేంద్రం నుండి రాష్ట్రానికి అందాయి. గతంలో 36.37 లక్షల డోసులు రాగా.. ఉత్సవాలు ప్రారంభమయ్యాక తొలిరోజు 2 లక్షలు, సోమవారం 4.40 లక్షలతో కలిపి 42.57 లక్షల వ్యాక్సినేషన్ రాష్ట్రానికి పంపినట్లయింద
టీకా మహోత్సవం – అరకొర డోసులు
Advertisement
తాజా వార్తలు
Advertisement