Friday, November 22, 2024

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ఘనసత్కారం.. తెనాలిలో కార్య‌క్ర‌మం

తెనాలి (ప్రభ న్యూస్) : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోనే ప్రత్యేకత సంతరించుకునే విధంగా.. ఆంధ్ర ప్యారీస్ తెనాలిలో మాజీ మంత్రి, టీడీపీ లీడ‌ర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ చలనచిత్ర ప్రదర్శనలు జరుగుతున్నాయని, మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు నక్క ఆనంద్ బాబు అన్నారు. కార్యక్రమంలో కళాకారులను సత్కరించుకునే ఏర్పాటు జరిగిందని, ఇందులో భాగంగా ఆదివారం ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్ర రావును సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. నందమూరి హరికృష్ణ కోడలు దీప్తి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగా మారింద‌న్నారు.

తెలుగువారి ఉన్నతి కోసం బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం ఆయన సినీ రంగాన్నివదిలి రాజకీయ రంగంలోకి వెళ్లినా.. పేదలకు సేవలందించారని అన్నారు. ఎన్‌టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఎన్టీఆర్ ను ఎవరూ మరువలేరని అన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సినీ రచయిత మహమ్మద్ సాబీర్, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, సిరి సంభాషణల రచయిత బుర్ర సాయి మాధవ్ ప్రముఖ పారిశ్రామికవేత్త కె.వి. రావు పలువురు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement