Friday, November 22, 2024

వారు నీరు పోసి పెంచారు…వీడు వాటిని న‌రికేశాడు…

తెనాలి : స్థానిక కొత్తపేటలోని సరోజిని హాస్పిటల్ రోడ్డులో నలుగురికి నీడనిచ్ఛే చెట్టును గుర్తు తెలియని దుండగుcలు మొదలంటూ నరికేశారు. తెనాలి మున్సిపాలిటీ లోని ఉద్యానవన శాఖ మూడు సంవత్సరాల క్రితం కొత్తపేట, బోస్ రోడ్ తదితర ప్రాంతాలలో మ్రొక్కలు నాటి పచ్చదనం, పరిశుభ్రత కొరకు పాటుపడుతున్నది. ఈ క్రమంలోనే ప్రతిరోజూ వాటర్ ట్యాంకర్లతో మ్రొక్కలకు నీళ్లు పెడుతూ చిన్నపిల్లలను సాకినట్లు సంరక్షించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అవే మ్రొక్కలు పెద్దవై నలుగురికీ నీడనూ, ఆక్సిజన్ లనూ పంచుతున్నాయి. అయితే కొన్నిచోట్ల తమ వ్యాపార సంస్థలకు అడ్డుగా ఉన్నాయని, మరి కొంతమంది తమ ఇళ్లకు అడ్డుగా ఉన్నాయని వీటిని నరుక్కుంటూ వెళ్లిపోతున్నారు. గతంలో బోస్ రోడ్డులోని కనికచెర్ల కళ్యాణమంటపం వద్ద తమ వ్యాపారసంస్థకు అడ్డుగా ఉన్నాయని కొందరు ఏపుగా పెరిగిన మూడు చెట్లను నరికివేశారు. అధికారులు ఏ చర్యలూ తీసుకోలేదు. కొంతమంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గతంలో హోంగార్డు గా పని చేసిన‌ వ్యక్తి ఈ నరికివేతకు కారకుడనీ, అక్కడ ఉన్న కొంతమంది చిరు వ్యాపారులను చీటికీ మాటికీ బెదరిస్తుంటాడనీ తెలిసింది. అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై కేసు నమోదు చేసి శిక్షించాలని పలువురు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement