Saturday, November 23, 2024

క‌రోనా క‌ట్ట‌డికి ఎపిలో మూడంచెల వ్యూహం…

అమరావతి, : కరోనా కట్టడికి ప్రభుత్వం మూడంచెల వ్యవస్థతో ప్రణాళిక సిద్ధం చేసింది. వైరస్‌ ఉధృతి.. రాష్ట్రంలో ఆస్పత్రుల పనితీరు.. ఫీజుల వసూళ్లపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో సమీక్షించిన అనంతరం ప్రభుత్వం మార్గ దర్శకాలు జారీ చేసింది. బాధితులకు అందుబాటులో అన్నిరకాల నియంత్రణ మం దులతో పాటు ఆస్పత్రుల్లో అధిక ఫీజులు.. అందుబాటులో ఉన్న పడకలను.. ఇతర సదుపాయాల కల్పన.. పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాల్లో ఐదు నుంచి 8 వరకు ప్రైవేట్‌ ఆస్పత్రులను క్లస్టర్లుగా గుర్తించటంతోపాటు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్లను ఆదేశించింది. బాధితులకు అవసరమైన వైద్య సేవలు, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచిం చింది. వైరస్‌ సాకుతో విచ్చలవిడిగా ప్రైవేట్‌.. కార్పొరేట్‌ ఆస్పత్రు లు వసూలు చేస్తున్న ఫీజులను కట్టడి చేసేందుకు ప్రణాళిక రూపొం దించింది. రాష్ట్ర స్థాయిలో టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర చైర్మన్‌గా, ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ రవిశంకర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈఒ, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేక అధికారి కేఎస్‌ జవహర్‌ రెడ్డి, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ సభ్యులుగా ఏర్పాటయ్యే ఈ కమిటీ జిల్లాల్లో కోవిడ్‌ నిర్వహణ.. నియంత్రణ చర్యలను సమీక్షిస్తుంది.
కలెక్టర్ల పర్యవేక్షణలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు
జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఐదు నుంచి 8 వరకు ప్రైవేట్‌ ఆస్పత్రులతో క్లస్టర్లను గుర్తించి రోగులకు వైద్య సేవలందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కలెక్టర్ల సిఫార్సు మేరకు అనుమతి ఇవ్వాలని దిశానిర్దేశం చేసింది. డ్రగ్స్‌ కంట్రోల్‌ విభాగం, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ప్లయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటవుతాయి. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు విస్తృతంగా తనిఖీలు నిర్వహించటంతో పాటు నిబంధనలు అతిక్రమించిన ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాయి. కాగా ఆస్పత్రులతో ఏర్పాటయ్యే క్లస్టర్లకు ఇన్‌చార్జిలుగా ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించింది. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, క్లస్టర్ల ప్రత్యేక అధికారులు కలెక్టర్ల పర్యవేక్షణలో పనిచేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
జేసీల నేతృత్వంలో కంటైన్మెంట్‌ కంట్రోల్‌
జిల్లాల్లో కోవిడ్‌ నియంత్రణ.. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న సేవలను పర్యవేక్షించే బాధ్యతలను జిల్లా స్థాయిలో జాయింట్‌ కలెక్టర్లు (వార్డు, గ్రామ సచివాలయాలు)కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వాసుపత్రులతో పాటు నెట్‌ వర్క్‌ ఆస్పత్రుల్లో అందుతున్న సేవలపై నిరంతరం నిఘా ఉంటుంది.ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం.. రోగులకు ఆహారం.. ఆరోగ్యమిత్ర సేవల పరిశీ లనకు సీసీటీవీ నెట్‌ వర్క్‌ను విస్తృతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రోగుల కుటుంబాలకు సమాచారం అందించే నిమిత్తం ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంలు, 104 కాల్‌ సెం టర్లకు అందుతున్న ఫిర్యాదులను జేసీలు పరిష్కరించాల్సి ఉంటుంది.
కాంట్రాక్ట్‌ వై ద్యసిబ్బంది నియామకం
రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన మేరకు మెడికల్‌ ఆఫీసర్లు, వైద్య సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం అనుమ తించింది. ఆరు నెలల కాలపరిమితితో కాంట్రాక్ట్‌ పద్దతిన కోవిడ్‌ రోగులకు వైద్య సేవలందిం చేందుకు నియమించుకోవాలని కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.కోవిడ్‌ నియంత్రణకు అవసరమైన 1170 మంది స్పెషలిస్టులతో పాటు మరో 1170 మంది జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు, 2వేల మంది స్టాఫ్‌ నర్స్‌లు, 306 మంది అనస్తీషియా టెక్నీషియన్లు, 330 మంది ఎఫ్‌ఎన్‌ఓలు, 300 మంది ఎంఎన్‌ఓ, మరో 300 మంది స్వీపర్ల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement