వట్టిచెరుకూరు, ఈతకు వెళ్లి నీటిలో మునిగి ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన కోర్నేపాడు ఎస్సీ కాలనీలో శుక్రవారం జరిగింది. కాలనీకి చెందిన బుల్లా వర్ధన్ (17), నేలపాటి ప్రభుకాంత్(16), బత్తుల సుధాకర్(16) కలిసి కోర్నేపాడు పొలాల్లో కొత్తగా వేసిన ప్లాట్లకు సమీపంలో ఉన్న మర్రిచ్చేట్టు కుంటలో ఈత కొట్టడానికి వెళ్లారు. అందరూ ఈత కొడుతున్న సమయంలో అక్కడ ఉన్న చెట్టుపై నుంచి దూకుతూ ఉన్నారు. చెట్టు కొమ్మ విరిగి కుంటలో పడటంతో అందులో చిక్కుకుని, ఊబిల ఉన్న మట్టిలో కురుకుపోయారు. ప్రక్కనే చెట్టు కింద ఉన్న కొందరు యువకులు నీటిలో దూకిన వారు పైకి రాకపోవడం గమనించి కేకలు వేయగా గ్రామస్తులు వచ్చి బయటకు లాక్కువచ్చి చూడగా బుల్లా వర్ధన్, బత్తుల సుధాకర్ చనిపోయారు. నేలపాటి ప్రభుకాంత్ కోన ఊపిరితో ఉండగా జిజిహేచ్ కి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో మరణించాడు.అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకులు మృతి చెందడంతో తల్లి దండ్రులు తీవ్ర వేదనకు గురయ్యారు. బుల్లా వర్ధన్ 4వ తరగతి వరకు చదువుకుని పొలం పనులకు వెళ్తున్నాడు. బత్తుల సుధాకర్ పదవతరగతి పూర్తి చేసాడు. నేలపాటి ప్రభుకాంత్ ప్రస్తుతం పదవతరగతి చదువుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు
Advertisement
తాజా వార్తలు
Advertisement