Saturday, November 23, 2024

థ‌ర్మా స్కాన‌ర్లు,ఆక్సీ మీట‌ర్లు, ఆవిరి మిష‌న్ ల ధ‌ర‌లు ఆకాశంలో…

అమరావతి, : థర్మా స్కానర్లు, ఆక్సి మీటర్లు, ఆవిరి మిషన్లకు గిరాకీ ఏర్పడింది. దీంతో మార్కెట్‌లో వీటి ధరలు రెట్టింపు అయ్యాయి. మార్చి వరకు సాధారణంగా ఉన్న వీటి ధరలు క్రమేణా పెరుగుతూ వచ్చాయి. వీటిని విక్రయించే బ్రాండెడ్‌ కంపెనీ నుంచి లోకల్‌ కంపెనీల వరకు అందరూ వాటి రేట్లను పెంచారు. కరోనా మొదటి దశలో ఆక్సీ మీటర్‌ రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.1000 నుంచి 1500 వరకు పెంచి అమ్ముతున్నారు. గతంలో రూ.3 వేలకు దొరికే థర్మా స్కానర్లు ప్రస్తుతం 5వేలకు పైగా పెరిగింది. ప్రతి వ్యాపార సంస్థలో థర్మా స్కానర్లు అవసరం కావడంతో వీటికి డిమాండ్‌ పెరిగింది. అదేవిధంగా రూ.250కి లభ్యమయ్యే థర్మామీటర్‌ను రూ. 400 పైగా పెంచి అమ్ముతున్నారు. రూ. 200లకు లభించే ఆవిరి తీసుకునే యంత్రాలను ప్రస్తుతం రూ.400 నుంచి రూ.500 వరకు అమ్ముతున్నారు. దీంతో సామాన్య ప్రజలు వాటిని కొనుగోలు చేయలేక ఇబ్బందులకు గురవుతున్నారు. కంపెనీలు ఏజెన్సీలు పెంచిన రేట్లు- తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విటమిన్‌ సి, విటమిన్‌ డి రేట్లపై కూడా ధరలు పెంచారని వినియోగదారులు ఆందో ళన చెందుతున్నారు. కరోనా నివారణకు సంబంధించిన మందులన్నీ పెంచేసినట్లు- వినియోగదారులు చెబుతు న్నారు. అత్యవసర మందులయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలావుండగా ప్రస్తుతం ఆక్సిజన్‌ కు కొరత ఏర్పడడంతో కృత్రిమంగా తయారు చేసే ఈ యంత్రాలకు విపరీతమైన డిమాండ్‌ వచ్చింది. గతంలో 20 నుంచి 25 వేలు విక్రయాలు జరిగే ఈ యంత్రం 80 నుంచి 90 వేల వరకు ధర పలుకుతోంది. బాధితుల అవసరాలను బట్టి ధరలు పెంచుతున్నారు. అయితే మార్కెట్‌ లో వీటికి గిరాకీ ఉండడంతో ఆన్‌ లైన్‌లో తక్కువ ధరలకు ఇస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్నట్లు- వార్తలు వినవస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement