Tuesday, November 19, 2024

మాచర్లలో ఫ్యాక్షన్ గొడవలే.. ఇందులో రాజకీయ కోణం లేదు : ఎస్పీ ర‌విశంక‌ర్ రెడ్డి

మాచర్ల పట్టణంలో జరిగిన ఘటనకు సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మాచర్ల పట్టణంలో ఇరుపార్టీల మధ్య జరిగిన ఘటనలో ఫ్యాక్షన్ కు సంబంధించిన మూలాలు ఉన్నాయి. గతంలో వెల్దుర్తి, మాచర్ల చుట్టు ప్రక్కల గ్రామాల్లో వివిధ హత్య కేసులలో పాల్గొన్నవారు ఇరుపార్టీలలో ఉంటూ మాచర్ల పట్టణంలో నివసిస్తున్నారు. ఈ సమాచారంపై ఈ రోజు వేకువ జామునే మా పోలీస్ అధికారులు, సిబ్బంది కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగినది. ఈ ఆపరేషన్ లో ఎటువంటి ఆయుధాలు లభించలేదు. కానీ ఎవరైతే వ్యక్తులు వివిధ గ్రామాల నుండి వచ్చి మాచర్ల పట్టణంలో ఉంటున్నారో వారిని గుర్తించడం జరిగినది.
ఈ రోజు టీడీపీ పార్టీ వారు “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి” అనే నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో వ్యతిరేక వర్గాన్ని రెచ్చగొట్టి వారిపై రాళ్లు రువ్వడం జరిగినది. తదుపరి ఇరుపార్టీల వారు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడం జరిగినది. ఈ దాడులు 20 – 30 సంవత్సరాలుగా ఉన్న ఫ్యాక్షన్ గొడవల వలన జరిగినవే తప్ప వీటిలో ఎటువంటి రాజకీయ కోణం లేదు. మా పోలీస్ అధికారులు, సిబ్బంది సత్వరమే స్పందించి ఇరువర్గాలు చెడగొట్టి పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు. మున్ముందు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బలగాలను మాచర్ల పట్టణంలో మోహరించడం జరిగినది. అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. మేము ఘటన జరిగిన ప్రదేశాలలో ఇప్పుడే పర్యటిస్తాం. ఈ ఘటనకు భాద్యులైన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి, తగిన తీసుకుంటున్నామ‌ని ఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement