Wednesday, November 20, 2024

తెనాలి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ అత్యవసర సమావేశం.

తెనాలి :జిల్లా ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ అత్యవసర సమావేశాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించారు.కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే శివకుమార్ చెప్పిన విధంగా 24 గంటలు కూడా గడవకుండానే ఈ సమావేశం ఏర్పాటు చేయడం పట్ల రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రజలు విశ్వసిస్తున్నారు.అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు పోలీస్,రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య మున్సిపల్ విభాగాలకు చెందిన పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొని సత్వర చర్యలు దిశగా చర్యలు జరిపారు.సమావేశం ముగిసిన అనంతరం సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ తెనాలి సబ్ డివిజన్ లో ప్రతిరోజు 150 నుండి 200 కోవిడ్ కేసులు వస్తున్నాయని వైద్యశాలలో కోవిడ్ టెస్టుల సామర్థ్యాన్ని పెంచనున్నట్లు స్పష్టం చేశారు.కోవిడ్ కేర్ సెంటర్ వద్ద ఆక్సిజన్ సౌకర్యం కల్పించినట్లు మరియు వైద్యశాలలో ప్రాథమిక సౌకర్యాలను పెంచుతామని పేర్కొన్నారు. ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తానని వైద్యశాల సిబ్బందితో సమన్వయానికి ఒక తహసీల్దారును కేటాయించనున్నట్లు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దిశలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు.రెండు మూడు రోజుల్లో సిటీ స్కాన్ మిషన్ బాగు చేస్తారని వైద్యశాలకు అంబులెన్సులు కేటాయిస్తారని తెలిపారు.240 పడకలు ఉన్న సామర్ధ్యానికి మరో వంద పడకలు వరకు కలుపుతా మన్నారు.వైద్యశాలకు వచ్చే రోగుల కొరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు కోవిడ్ విభాగానికి ఎక్కువ మంది డాక్టర్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. అవకతవకలకు పాల్పడుతున్న ఇరువురు కిందిస్థాయి ఉద్యోగస్తుల సస్పెన్షన్ కు సిఫార్సు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ కష్టకాలంలో సిబ్బంది రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించినట్లు తెలిపారు. పట్టణంలోని ప్రైవేట్ వైద్యశాల ప్రతినిధులతో కూడా సమావేశం నిర్వహించి ప్రతి వైద్యశాలలో 50 శాతం పడకలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటామని తద్వారా ఎక్కువ రోగులకు సేవ చేసే వీలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు.ఈసమావేశంలో వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ నన్నపనేని ప్రతాప్,సూపరింటెండెంట్ డాక్టరు సనత్ కుమారి, మున్సిపల్ చైర్పర్సన్ కాలేదా నసీం,మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు,తహసీల్దార్ రవి బాబు,ఎంపీడీవో విజయా లక్ష్మణ్,సిఐ హరికృష్ణ పలువురు అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement