Saturday, November 23, 2024

26 బంద్ కు తెలుగుదేశం మ‌ద్ద‌త్తు..

అమరావతి – విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పోరాట వేదిక, రైతు సంఘాలు ఈనెల 26న తలపెట్టిన భారత్ బంద్​కు తెదేపా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు బంద్​లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కర్షక, కార్మిక, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో తెదేపా ఏనాడూ వెనుకంజ వేయదని స్పష్టం చేశారు. ఉక్కు ప్రైవేటీకరణకు పార్లమెంట్ సాక్షిగా కేంద్రం అడుగులు వేస్తుంటే వైకాపా ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్, కార్మికుల జీవితాలపై వైకాపాకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రాజీనామాలు చేసి పోరాటానికి రావాలని సవాల్‌ విసిరారు. నయవంచనకు, నమ్మక ద్రోహానికి వైకాపా మారుపేరని దుయ్యబట్టారు. దేశానికి గర్వకారణమైన విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత జగన్​పైన లేదా అని నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement