తెనాలి, ఫిబ్రవరి 18 ప్రభా న్యూస్ : వైసీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నదని టిడిపి నేతలు పేర్కొన్నారు. శుక్రవారం అనపర్తి లో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకుని పోలీసులు ప్రదర్శించిన అత్యుచాహాన్ని ఖండిస్తూ ఆ పార్టీ నాయకులు శనివారం తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, రాష్ట్రంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలని , సైకో పోవాలి – సైకిల్ రావాలి అని నినాదాలు చేసి అనంతరం నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన నిరసన చేశారు. ఈ సందర్బంగా పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్, రాష్ట్ర ఎస్.సి.సెల్ అధికార ప్రతినిధి కంచర్ల ఏడుకొండలు,తెనాలి మండల ఎస్.సి.సెల్ అధ్యక్షుడు కోపల్లె శ్రీనులు మాట్లాడుతూ రాష్ట్రంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి బదులుగా రాజా రెడ్డి రాజ్యాంగం అమలులోకి తేవడానికి వైసీపీకి పోలీసులు సహకరించడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు., త్వరలో పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అందుకు పోలీసులు కూడా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
నిరసన కార్యక్రమంలో మల్లవరపు విజయ్, బొబ్బిళ్ళపాటి ప్రసాద్, దొప్పలపూడి శ్యామ్, అత్తోట శరత్, బుల్లా రమేష్, గడ్డేటి రాజా,కనక రాంబాబు, జొన్నాదుల మహేష్, ఈదర శ్రీనివాసరావు,నాగూర్,జూపూడి ప్రవీణ్,వేంకట రత్నం, మీసాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.