అమరావతి: దివంగత నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామరావు స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని అన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. అమరావతిలో ఎన్టీఆర్ భవన్ లో పార్టీ పతకాన్ని చంద్రబాబు ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు.. అనంతరం కెక్ కత్తిరించి అందరితో పంచుకున్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతు సంక్షేమం కోసం ఎన్టీఆర్ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. పేదల పక్కా ఇళ్లకు 40ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన పార్టీ టీడీపీ అన్నారు. 9 నెలల్లో ప్రజాధరణ పొంది అధికారంలోకి వచ్చిన ఘనత టీడీపీదని పేర్కొన్నారు. రాజకీయాలంటే సేవాభావం, పేదల సంక్షేమం అని ఎన్టీఆర్ సరికొత్త నిర్వచనం చెప్పారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. తెలుగుజాతి ఉద్ధరణ కోసమే ఎన్టీఆర్ పార్టీ స్థాపించారని టీ అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్‌దేనని స్పష్టం చేశారు. ముందుచూపుతో హైదరాబాద్‌లో తాము శ్రీకారం చుట్టిన జినోమ్ వ్యాలీలో నేడు కరోనా వ్యాక్సిన్ కనుగొన్నారని చంద్రబాబు చెప్పారు. టీడీపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలనే వైఎస్, ఆ తర్వాత వచ్చిన సీఎంలు కొనసాగించారని గుర్తుచేశారు. ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో రెండు ఎకరాలు కొనే పరిస్థితులు రివర్స్ అయ్యాయన్న కేసీఆర్ మాటలు అందరూ గ్రహించాలని సూచించారు. ఏపీలో రాష్ట్రాభివృద్ధి రివర్స్ గేర్‌లో పయనిస్తోందన్నారు. త్యాగాల కోసం పనిచేసే కుటుంబం లాంటి పార్టీ టీడీపీ అన్నారు. 40 ఏళ్లలో 21 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ స్పూర్తితోనే ముందుకుసాగుతాం – చంద్రబాబునాయుడు..
By sree nivas
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement