Friday, October 18, 2024

తాడేపల్లి నూతన తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన నాగిరెడ్డి

తాడేపల్లి,ఫిబ్రవరి21(ప్రభ న్యూస్) తాడేపల్లి మండల నూతన తహసిల్దారుగా నాగిరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ కార్యాలయ సిబ్బంది అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తహసిల్దార్ నాగిరెడ్డి మాట్లాడుతూ
తాడేపల్లిలోని ప్రజలకు సేవలు అందించేందుకుముందుంటానని అన్నారు. ప్రజల సమస్యలు అవసరాలు అనుగుణంగా పనిచేస్తానన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్గా ప్రధాన పదోన్నతి పొందిన వాకా శ్రీనివాసులరెడ్డి, ఇంచార్జ్ తహసిల్దార్ రాంప్రసాద్ బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement