బాపట్ల కోవిడ్ కేంద్రాలలో చికిత్స పొందే రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ అన్నారు. పట్టణంలోని మానవ వనరుల అభివృద్ధి శిక్షణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగుల వివరాలతో పాటు వైద్య సదుపాయం,ఆహార సదుపాయం పై కోవిడ్ సెంటర్ ఇంచార్జ్ టిపిఓ శ్రీలక్ష్మిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోగులకు అందించే ఆహారం పై ఎటువంటి సమస్యలు తలెత్తినా,నాణ్యత ప్రమాణాలు లోపించిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనంతరం ఏరియా వైద్యశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి చేస్తున్న సేవలపై వైద్యాధికారులు అడిగి తెలుసుకున్నారు.రోజురోజుకీ పెరుగుతున్న కేసులపై అధికారులు అప్రమత్తంగా ఉంటూ,ఆ ప్రాంతాల్లో ప్రజలకు జాగ్రత్తలు తీసుకునే విధంగా కరోనా పై అవగాహన కల్పించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, తహసిల్దార్ శ్రీనివాస్ ఆర్ఐ సురేష్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
By sree nivas
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- AP Nesw
- ap news today
- bapatla
- corona
- Guntur City News
- Guntur Local News
- guntur news
- Guntur News Telugu
- Guntur News Today
- Guntur Telugu News
- sub collector
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- visits
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement