Tuesday, November 26, 2024

విద్యార్థులు ప్రయోజనాత్మక పరిశోధనలు చేయాలి : డాక్టర్ అపర్ణ

తాడేపల్లి : విద్యార్థులు ప్రయోజనాత్మక పరిశోధనలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెంబర్ సెక్రటరీ డాక్టర్ వై.అపర్ణ పిలుపునిచ్చారు. కె.ఎల్ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో బయోట్రెండ్స్-22 పేరిట టెక్నికల్ ఫెస్ట్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ వై.అపర్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. బయోటెక్నాలజీ విద్యార్థులకు ఆలోచనలను, ప్రతిభను, నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది ఒక గొప్ప వేదిక అని తెలిపారు. ప్రపంచంలో శాస్త్రవేత్తలు చేసినట్లుగా, యువకుల్లో పరిశోధనా విధానం పెంపొందించడం, వారి అనుభవాలు, ఆవిష్కరణలను రూపొందించడంలో తమ కౌన్సిల్ ముందుంటుందని వెల్లడించారు. ఇంజనీరింగ్ లో బయో టెక్నాలజీకి ఒక ప్రత్యేకత ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రో ఛాన్సలర్ డాక్టర్ జగన్నాథ్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్బారావు, విద్యార్థి విభాగ సంక్షేమ అధిపతి డీన్ డాక్టర్ హనుమంతరావు, బయో టెక్నాలజీ విభగదీపతి డాక్టర్ గిరిధర్, ప్రొఫెసర్ శ్రీనివాసులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement