గుంటూరు కల్చరల్, – కళాకారులకు పురస్కారాలు అభినందనీయమని మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్బంగా యువకళావాహిని ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై జరిగిన యువకళావాహిని రంగస్థల పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి యువకళావాహిని అధ్యక్షుడు వై.కె.నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ కళాకారులను సంతృప్తిపరిచేవి పురస్కారాలను, అటువంటి పురస్కారాలను యువకళావాహిని ఆధ్వర్యంలో పలువురు రంగస్థల ప్రముఖులకు పురస్కారాలను ప్రధానం చేసి వారికి ప్రోత్సహకాన్ని అందించటం అభినందనీయమన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వై.కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ మూడు రోజులపాటు పలువురు సన్మానిస్తున్నామని తెలిపారు. కార్యక్రమాలలో భాగంగా శ్రీసాయి ఆర్ట్స్ కొలకలూరు వారిచే గోపరాజు విజయ్ దర్శకత్వం వహించిన మనసుతో ఆలోచిస్తే నాటిక ప్రదర్శన సందేశాత్మకంగా సాగింది. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో పలువురు రంగస్థల కళాకారులకు రంగస్థల పురస్కారాలను యువ కళావాహిని వారు అందించారు. గురజాడ పురస్కారాన్ని తులసి బాలకృష్ణ , యెన్.ఎస్. నారాయణ బాబు, బళ్లారి రాఘవ పురస్కారాన్ని భాగీ శివశంకరశాస్త్రి, జి. లక్ష్మి, రఘురామయ్య పురస్కారాన్ని ఏ. ఆదినారాయణ రావు, పద్మశ్రీ గ్రహీత ఎడ్ల గోపాలరావు, సి.ఎస్. ఆర్. పురస్కారం గరికపాటి కాళిదాస్, రాజర్షి, గరికపాటి రాజారావు పురస్కారం ఏపూరి హరిబాబు , గంగోత్రి సాయి, వనారస గోవిందరావు పురస్కారం డీ. ఎల్. కాంతారావు, ఎస్. కె. జానీబాషా లను పురస్కారాలతో సంస్థ వారు అతిధులు సత్కరించారు. నాటక సమీక్షకులు కారుమూరి సీతారామయ్య , యర్రా ఆదినారాయణ కళాపోషకులు వి. వి. రాఘవరెడ్డి, జి. నెహ్రూలను సంస్థ వారు సత్కరించారు. కార్యక్రమంలో సాంస్కృతిక ప్రముఖుడు జి. పున్నారావు, ఆలయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సి. హెచ్. మస్తానయ్య, యువకళావాహిని సభ్యులు బొప్పన నరసింహారావు తదితరులు పాల్గొని కార్యక్రమాలను పర్యవేక్షించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement