Thursday, November 21, 2024

ఎసిఐసి కెఎల్ కెఎల్ స్టార్ట్అప్ ఫౌండేషన్ తో శ్రీనిధి హైదరాబాద్ కళాశాల ఎంఒయు

తాడేపల్లి,ఫిబ్రవరి20(ప్రభ న్యూస్) కెఎల్ విశ్వవిద్యాలయంలోని ఎసిఐసి కెఎల్ స్టార్ట్అప్ ఫౌండేషన్ తో ఘట్‌కేసర్ లోని హైదరాబాద్ శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు టెక్నాలజీ కళాశాలతో పరస్పర అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు కెల్ స్టార్ట్అప్ ఫౌండేషన్ సిఇఒ గోవిల్ అలోక్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. కెఎల్ యు లో జరిగిన అవగాహనా ఒప్పంద కార్యక్రమoలో కెఎల్ స్టార్ట్అప్ ఫౌండేషన్ సీఈఓ గోవిల్ అలోక్, శ్రీనిధి కళాశాల డైరెక్టర్ డాక్టర్ సి.వి.టామిలు ఇరువురు ఒప్పంద పత్రాలపైన సంతకాలు చేసిన అనంతరం సంతకాలు చేసిన పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందంతో గ్రామీణ వికాసం, అభివృద్ధికోసం అంకుర పరిశ్రమల ఏర్పాటుకు పరస్పర సహాయ సహకారాలు అందజేసుకోవడం జరుగుతుందని గోవిల్ అన్నారు. అంకుర పరిశ్రమల ఏర్పటుకు కావాల్సిన సహాయ సహకారాలను అటల్ కామ్యునిటి ఇన్నోవేషన్ సెoటర్ (ఎసిఐసి-కెఎల్) అందజేయనున్నట్లు తెలిపారు. ఆధునిక, సంకేతికను విద్యకు అనుసంధానం చేయడం ద్వార నూతన ఆవిష్కరుణలను అనేకం సమాజానికి అందించవచ్ఛని అన్నారు. విద్యార్దులు తాము అభ్యసించిన విద్యకు సాంకేతికతను జోడించాలనీ సుచించారు. ఈ కార్యక్రమంలో ఎసిఐసి కెఎల్ స్టార్ట్అప్ ఫౌండేషన్ సీఈఓ గోవిల్ అలోక్, శ్రీనిధి కళాశాల డైరెక్టర్ డాక్టర్ సి.వి.టామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement