అమరావతి – స్కిల్ డెవలప్‌మెంట్అక్రమ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇవాళ ఉదయం నుంచి హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరగ్గా మధ్యాహ్నానికి లోకేష్‌పై ఉన్న స్కిల్ కేసును హైకోర్టు క్లోజ్ చేసింది. దీంతో లోకేష్‌కు బిగ్ రిలీఫ్ దక్కినట్టయ్యింది. లోకేష్‌ను స్కిల్ కేసులోనిందితుడిగా తాము చేర్చలేదని సీఐడీ చెప్పింది. ముద్దాయిగా చూపని కారణంగా ఆయన్ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఒకవేళ ఈ కేసులో నిందితుడిగా చేరిస్తే 41-ఏ కింద నోటీసులు ఇస్తామని న్యాయస్థానానికి సీఐడీ అధికారులు వెల్లడించారు. సెక్షన్ ల ప్రకారం విచారిస్తామని తెలిపారు.. దీంతో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కు ముగింపు పలికింది..
Skill Case … అబ్బే… అరెస్ట్ చేయబోం – లోకేష్ ను విచారించి పంపేస్తాం..
Advertisement
తాజా వార్తలు
Advertisement