గుంటూరు సిటీ – విధులు ముగించుకుని తిరిగి ఇంటికి పయనమై ద్విచక్రవాహనంపై వెళుతూ ప్రమాద వశాత్తూ వాహనంపై నుండి జారిపడి తలకు బలమైన గాయమై ఆ వ్యక్తి మృతి చెందిన సంఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం గుంటూరు నగరపాలక సంస్థ లోని అవుట్సోర్సింగ్ పద్ధతి పై విద్యా నగర్ పార్క్ లో గత పదేళ్ల నుండి సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న పుల్లగూర సాంబశివరావు (50)బుధవారం మధ్యాహ్నం తన విధులను ముగించుకొని తన స్వగ్రామమైన పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు నకు ద్విచక్రవాహనంపై వెళ్తూ అదే గ్రామంలో ప్రమాదవశాత్తు వాహనంపై నుండి జారిపడగా అతని తలకు బలమైన గాయమైంది. అత్యవసర చికిత్స నిమిత్తం గుంటూరు లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు స్థానికులు తరలించారు. డాక్టర్లు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలను అందించగా అతను చికిత్స పొందుతూ గురువారం మరణించారు. జి ఎం సి కార్మిక యూనియన్ నాయకులు ఈదుమూడి మధుబాబు, మానస సరోవరం అవుట్సోర్సింగ్ సూపర్వైజర్ పుట్ల డేవిడ్ పాల్ వైద్యశాలకు వెళ్లి అతని భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. సాంబశివరావు మృతిచెందిన వార్తను నగర కమిషనర్ చల్లా అనురాధ కు ఈదుమూడి మధుబాబు తెలియజేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వపరంగా రావాల్సిన నష్టపరిహారం ఐదు లక్షల రూపాయలతో పాటు అతని కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని అదేవిధంగా పి ఎఫ్ నుంచి అతని చెందవలసిన డబ్బులు త్వరగా ఆ కుటుంబాన్ని చేరే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మధుబాబు నగర కమిషనర్ అనురాధ ను కోరారు
Advertisement
తాజా వార్తలు
Advertisement