అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అనుమతినివ్వాలని హైకోర్టును రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) అభ్యర్థించింది. కౌంటింగ్, ఫలితాల ప్రకటనను పూర్తి చేసి, ఆ తరువాత ఎంపీపీ, జెడ్పీపీపీల కోఆప్టెడ్ సభ్యులు, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికను కూడా పూర్తి చేస్తామని, దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ సంపూర్ణమవుతుందని వివరించింది. వీలైనంత త్వరగా కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపడితే మేలన్న ఉద్దేశంతోనే ఈ అభ్యర్థన చేస్తున్నామంది. కోవిడ్ సెకండ్ వేవ్ సవాలు విసురుతోందని, అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బ్యాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామంది.
ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అనుమతివ్వండి…..
By sree nivas
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement