అమరావతి, : మార్చినెల జీతాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాదిమంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. అందరికీ సోమవారంనాడు జీతాలు జమ అవుతాయని ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి తుమ్మా విజయకుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగింపు, వరుస సెలవులవల్ల జీతాల చెల్లింపు ఒకటి రెండు రోజులు ఆలస్యమైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మందికి పైగా ఉద్యోగు లు, 3.60 లక్షల మంది ప్రభుత్వ పింఛనుదారులు ఉన్నారు. వీరందరికీ ప్రతి నెలా రెండు, మూడు తేదీల్లో వేతనాలు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతుంటాయి. అయితే, ఏప్రిల్ 1వ తేదీన ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజు కావడం, ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే కావడంతో బ్యాంకులు పనిచేయలేదు. శనివారం బ్యాంకులు పనిచేయడంతో జీతాలు, పెన్షన్లు వస్తాయని ఎదురుచూశారు. అయితే నిరాశే ఎదురయింది. ఈలోగా ఆదివారం ప్రభుత్వం జీతాల చెల్లింపుపై స్పష్టతనిస్తూ ప్రకటన విడుదల చేయడం విశేషం.
Advertisement
తాజా వార్తలు
Advertisement