Monday, November 25, 2024

రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

బాపట్ల – పట్టణంలో రహదార్ల విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.ఇప్పటికే అనేక రహదారుల విస్తరణ చేపట్టి నూతన రహదారులను నిర్మించారు. అందులో భాగంగానే చిల్ రోడ్డు ప్రాంతంలో నూతనంగా ఆరు మీటర్ల సర్కిల్ తో పాటు, వాటర్ ఫాల్ ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండ కర్లపాలెం వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించేందుకు రామాలయం పక్క నుండి విస్తరణ పనులు చేపట్టారు.మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ మాట్లాడుతూ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రాకపోకలకు చిల్ రోడ్ సెంటర్ లో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని ప్రజల విన్నపాల మేరకు సమస్యను పరిష్కరించాలని రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నామని చెప్పారు.త్వరలో అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement