Tuesday, November 26, 2024

పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి

బాపట్ల ఎన్నికలను సజావుగా పారదర్శకంగా,నిర్వహించాలని తహశీల్దార్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం స్థానిక ఏబీఎన్ హై స్కూల్ లో జడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికలలో విధులు నిర్వహించే పిఓ,ఎపిఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ మండలంలో జరిగే జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలలో సిబ్బంది జాగ్రత్తలు పాటించాలి అన్నారు.మొత్తం 237 మంది సిబ్బందితో 41 ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలు,73 జెడ్పిటిసి పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహిస్తున్నామన్నారు. సిబ్బంది కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేయాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు.ప్రతి ఒక్క ఓటర్ ను ధర్మా స్కాన్ చేసి,మాస్క్ ధరించి ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు కోవిడ్ లో ఉన్న వారికి ఓటు హక్కు కల్పిస్తున్నామని,అన్ని జాగ్రత్తలు పాటించి ఎక్కడ ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా ప్రతిష్టాత్మకంగా పోలింగ్ జరిగేందుకు కృషి చేస్తున్నామన్నారు.ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు,బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రాధాకృష్ణ,ఈఓపిఆర్డీ ఎలీషాబాబు,మండల విద్యాశాఖ అధికారి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement