Monday, November 18, 2024

వాలంటీర్ల విశిష్ట సేవ‌ల‌కు న‌గ‌దు అవార్డులు….

అమరావతి, : ఉత్తమ పని తీరు కనపరుస్తున్న వాలంటీ-ర్లను ఉగాది రోజున సత్కరించే కార్యక్రమానికి ముఖ్య మంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరు కానున్నారు. నేడు ఆయన కృష్ణా జిల్లాలోని పెనమూలూరు నియోజక వర్గ పరిధిలోని పోరంకి గ్రామంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదేరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోనూ ఈ కార్యక్ర మాన్ని పెద్ద ఎత్తున పండుగ వాతావరణం లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సత్కార కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. వాలంటీ-ర్లను సత్కరించడం సహా ఇతర అవసరాలకు గానూ రూ. 261 కోట్ల విడుదల చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వాలంటీ-ర్లకు ప్రోత్సాహకా లను ఇచ్చేందుకు.. ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్టు- ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రల పేరిట విశిష్ట సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీ-ర్లకు నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నా రు. ఉగాది రోజున ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. సేవా వజ్రకు రూ. 30 వేలు, సేవారత్నకు రూ. 20 వేలు, సేవా మిత్రకు రూ. 10 వేల నగదు పురస్కారం, శాలువాతో గౌరవిస్తారు. ప్రకృతి వైప రీత్యాల్లో అందించిన సేవలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది. మూడు కేటగిరీల్లో మొత్తం 2,22,900 మంది గ్రామ, వార్డు వాలంటీ-ర్లను అవార్డులతో సత్కరించాలని నిర్ణయించారు. ఉగాది నుంచి ప్రతి జిల్లాలో రోజూ ఒక నియోజ వర్గంలో వాలంటీ-ర్లకు అవార్డులు, సత్కార కార్య క్రమాలను నిర్వహిస్తారు. మొత్తం మూడు కేటగిరీల్లో అవార్డులు, రివార్డులు అందజేయనున్నారు. మొదటి కేటగిరీలో 2,18,115 మంది వాలంటీ-ర్లకు ‘సేవా మిత్ర’ అవార్డు అందజేస్తారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఏడాదికిపైగా సేవలందించినవారికి అవార్డు కు ఎంపిక చేస్తారు. వీరికి రూ.10 వేలు నగదు, ప్రశం సా పత్రం, శాలువా, బ్యాడ్జితో సత్కరించ నున్నారు. రెండో కేటగిరీలో 4 వేల మంది వాలంటీ-ర్లకు ‘సేవా రత్న’అవార్డు ఇస్తారు. ఇంటింటి సర్వే, పింఛన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం వంటి కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతి మండలంలో ఐదుగురు చొప్పున, మున్సిపాలిటీ-ల్లో ఐదుగురు చొప్పున, కార్పొరేషన్లలో పది మంది చొప్పున మొత్తం 4 వేల మంది వాలంటీ-ర్లను ‘సేవారత్న’ అవార్డులకు ఎంపిక చేస్తారు. వీరికి రూ .20 వేలు నగదు, సర్టిఫికెట్‌, శాలువా, బ్యాడ్జి, మె డల్‌తో సత్కరించనున్నారు. మూడో కేటగిరీలో 875 మంది వాలంటీ-ర్లకు ‘సేవా వజ్ర’ అవార్డు ఇస్తారు. ఇం టింటి సర్వే, పింఛన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం వంటి కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 875 మంది వలంటీ-ర్లను ‘సేవా వజ్ర’ అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.30 వేల నగదు, సర్టిఫికెట్‌, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో సత్కరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement