Friday, November 22, 2024

ఎపిలో ఫైలు క‌ద‌ల‌దు – పెన్ష‌న్ రాదు

పదవీ విరమణ చేసినా బెనిఫిట్స్‌ అందవు
రిటైర్‌ అయిన రెవెన్యూ ఉద్యోగులకు తప్పని తిప్పలు
ఏళ్ల తరబడి… సీసీఎల్‌ఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే
ఓసారి ఫైలు రాలేదంటారు.. మరోసారి ఫైలు కనబడలేదంటారు
ఉన్నతాధికారులు ఉన్నా సరైన సమాధానం చెప్పరు
ఫిర్యాదుల పేరుతో కాలయాపన
ఇదీ సీసీఎల్‌ఏ కార్యాలయం పనితీరు

అమరావతి, : అక్కడ ఫైలు కనపడదు.. ఒకవేళ కనిపించినా సరైన సమాధానం చెప్పేవారు ఉండరు.. అసలు ఎందుకు ఫైలు ఆపారో కూడా చెప్పరు.. అదేమని గట్టిగా నిలదీస్తే జిల్లా కలెక్టర్‌ నుంచి ఫైలుకు సంబంధించి సమగ్ర సమాచారం రాలేదంటారు.. అందుకు సంబంధించిన నివేదికలన్నీ రిటైర్మెంట్‌కు సంబంధించిన ఫైలుతోనే జతపరిచి ఇచ్చినా కూడా అక్కడి అధికారుల నుంచి అదే నిర్లక్ష్యమైన సమాధానం వినిపిస్తుంది. దీంతో పదవీ విరమణ చేసిన రెవెన్యూ శాఖలోని ఉన్నత స్థాయి అధికారులు సైతం రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం ఏళ్ల తరబడి ఆ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొంతమంది సిబ్బంది చేతివాటంతో అవినీతి అక్రమాలకు ఆ కార్యాలయం నిలయంగా మారుతుందన్న విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఆ కార్యాలయం ఏదో తెలుసా..? భూపరిపాలనా విభాగం (సీసీఎల్‌ఏ). ఆ శాఖలో జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులుగా పనిచేసి
పదవీ విరమణ చేసిన అధికారులే సీసీఎల్‌ఏ కార్యాలయంలో ప్రక్షాళన చేప ట్టాలని, లేదంటే తమలాంటి వారికి న్యాయం జరగదంటూ ఆవేదన వ్యక్తం చేస్తు న్నారంటే ప్రధాన కార్యాలయంలో అధికా రులు ఏ స్థాయిలో రిటైర్‌ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ శాఖ ల్లో రెవెన్యూ శాఖ ఎంతో కీలకమైంది. అదే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ సం క్షేమ పథకాల అమలులో కూడా ఆ శాఖది పెద్దన్న పాత్ర. ఇం తటి ప్రాముఖ్యత కలిగిన రెవెన్యూ శాఖలో అధికా రులు, సిబ్బంది కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉం టారు. విధినిర్వహణలో ప్రభుత్వంతో పాటు ప్రజ లకు కూడా మెరుగైన సేవలందిస్తుంటారు. ఇంతటి ప్రాధా న్యత కలిగిన శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తరువాత వారి గురించి పట్టించుకునే వారే ఉండడం లేదు. కనీసం ప్రభుత్వ పరంగా అందాల్సిన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కూడా సకాలంలో చేతికందడం లేదు. ఓసారి ఫైలు రాలేదంటారు.. మరోసారి ఫై లు కనబడలేదంటారు
విజయవాడ గొల్లపూడిలోని సీసీఎల్‌ఏ కార్యాల యంలో కొంతమంది అధికారుల పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవు తున్నాయి. ఆ శాఖ ఉన్న తాధికారుల పేరు చెప్పి క్రింది స్థాయి అధికారులు పదవీ విర మణ చేసిన సహచర శాఖకు చెందిన జిల్లా స్థాయి అధికారులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖ లో పదవీ విరమణ చేసిన ఉద్యో గులకు సంబంధించిన బెని ఫిట్స్‌ , పెన్షన్‌ ఫైళ్లు సీసీఎల్‌ఏకు పంపు తారు. అయితే తహసీ ల్దార్‌ కార్యాలయంలో పనిచేసే క్రింది స్థాయి ఉద్యోగులకు సంబంధిం చిన రిటైర్మెంట్‌ ఫైళ్లు ఆయా జిల్లా కలెక్టర్లే పరిశీలించి పెన్షన్‌కు అనుమతులిస్తారు. తహసీల్దార్‌ స్థాయి నుంచి డీఆర్‌ఓ, ఏజేసీ స్థాయిలో పనిచేసిన ఉన్నతాధికా రులు పదవీ విర మణ చేస్తే అందుకు సంబంధించిన రిటైర్మెం ట్‌ బెనిఫిట్స్‌ సీసీఎల్‌ఏ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఆ కార్యాల యంలో పనిచేసే ఉన్నతాధికా రులు అందుకు సంబం ధించిన ఫైలుపై సంతకం పెట్టాకే వారికి బెనిఫిట్స్‌ విడు దలవుతాయి. అయితే రాష్ట్రవ్యా ప్తంగా ఆయా జిల్లా లలో ఉన్నత హోదాలో పనిచేసి రిటైరైన అధికారులకు సంబంధించిన ఫైళ్లు సీసీఎల్‌ ఏలో ఏళ్ల తరబడి పెండిం గ్‌లో ఉన్నాయి. సంవత్స రాల తరబడి రిటైరైన ఉద్యో గులు కార్యాల యం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే అక్కడ పనిచేసే అధికా రుల నుంచి వారు వెళ్లిన ప్రతిసారీ కొత్తరకం సమాధా నం వినిపిస్తుంది. ఓసారి ఫైలు రాలే దంటారు.. మరో సారి ఫైలు కనిపించడం లేదంటారు.. అలా ఎందుకు చెబుతున్నారో వారికి అర్థంకాక చివరకు మీకేం కావాలన్నా ఇస్తాం.. మా ఫైలు సంగతి చూడండి బాబూ అంటూ వేడుకోవాల్సి వస్తోంది. అలా రిటైరైన ఉద్యోగులను వారి దారిలోకి తెచ్చుకుని ప్రతి ఫైలుకు ఓ ధర నిర్ణయించి జేబులు నింపుకుంటున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు చిత్తూరు జిల్లా మదన పల్లికి చెందిన ఓ అధికారి 2014లో పదవీ విరమణ చేశారు. అప్పటి నుండి గడిచిన 7 సంవత్సరాలుగా రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆయనకు సరైన సమాధానం చెప్పినవారే లేరు.
ఉన్నతాధికారులు దృష్టి సారించాలి
చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రే షన్‌ కార్యాలయంలో అసలేం జరుగుతుందో రాష్ట్ర స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయం పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారులు సైతం స్పష్ట ం చేస్తున్నారు. విధినిర్వ హణలో ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొచ్చేలా సేవలందిస్తే పదవీ విరమణ చేశాక తమ బెనిఫిట్స్‌ను సకాలంలో అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తు న్నారంటూ పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఆ దిశగా దృష్టి సారించి సీసీఎల్‌ఏలో రిటైర్మెంట్‌ ఫైళ్లు ఎందుకు జాప్యం జరుగుతుందో విచారిస్తే వాస్తవాలు వెలు గులోకి వస్తాయి.
ఫిర్యాదుల పేరుతో కాల‌యాప‌న‌..
రెవెన్యూ శాఖలో ఉన్నత హోదాలో పనిచేసే అధికారులు సర్వీసులో ఉన్న సమయంలో ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక సందర్భంలో భూ విషయంపై ఫిర్యాదులు వెళ్తుంటాయి. తరచూ ఉన్నతాధికారు లకు వెళ్లిన ఫిర్యాదులపై అనేక సందర్భాల్లో విచారణ కూడా జరుపుతారు. అయితే రిటైర్మెంట్‌ అయ్యే లోపు అటువంటి ఫిర్యాదులను పరిష్కరించి అందుకు సంబంధించిన నివేదికలను ఉన్నతాధికా రులకు అందజేయాలి. అయితే అందుకు పూర్తి భిన్నంగా రెవెన్యూ శాఖలో తహసీల్దార్‌ హోదాలో ఉన్న ఓ అధికారిపై ఫిర్యాదులు వస్తే రిటైరైన తరు వాత కూడా విచారణ జరుపుతూనే ఉంటారు. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడు నెలల్లోపు ఆ ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదికలు అందజేయాలి. తప్పు చేసి ఉంటే ఉన్నతాధికారుల సూచన మేరకు ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలి. అయితే రెవెన్యూ శాఖలో కొన్ని జిల్లాలలో ఆ తరహా విచారణలు వేగవంతంగా పూర్తవుతున్నా మరి కొన్ని జిల్లాల లో తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటిని బూచీగా చూపించి సీసీఎల్‌ఏలోని కొంతమంది అధికారులు మీపై ఫిర్యాదులు ఉన్నాయని, అందుకే రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ మంజూరులో జాప్యం జరుగు తుందని కుంటిసాకు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్‌ నుంచి క్లీ న్‌చిట్‌ తెచ్చు కుంటేనే ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement