నిధురపోయే సమయం తప్ప… మిగిలిన అన్ని గంటలు ఫీట్స్ తో జీవనం….
మెదడులో సున్నితమైన భాగంలో గడ్డ తొలగింపు…
శస్త్ర చికిత్సలో త్రీడీ బ్రెయిన్ మ్యాపింగ్ పద్దతి వినియోగం…
గుంటూరు మెడికల్ – మెదడులోని అతి సున్నితమైన భాగంలో అరుదుగా ఏర్పడే గడ్డని న్యూరోనావిగేషన్ పద్దతి,అత్యధునాతన త్రీడీ కంప్యూటర్ బ్రెయిన్ మ్యాపింగ్ సిస్టం ఉపయోగించి మెదడులో ఏర్పడిన గడ్డని విజయవంతంగా తొలగించి బాలుడు ప్రాణాలు కాపాడారు గుంటూరు బ్రింద న్యూరో సెంటర్ వైద్యులు.బుధవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ హనుమ శ్రీనివాస రెడ్డి వివరాలు వెల్లడించారు.ప్రకాశం జిల్లా ఇంకొల్లుకు చెందిన బురుసు మహేష్(10) 6ఏళ్ల క్రితం స్కూలులో ఆడుకుంటూ కిందపడగా ఫీట్స్ వచ్చాయి.అప్పటి నుంచి సదరు బాలుడు ఫీట్స్ కు మందులు వాడుతున్నారు.అయితే గత నెల రోజుల నుంచి బాలుడి ఎడమ చెయి పడుకునే సమయంలో తప్ప మిగిలిన సమయం అంతా ఫీట్స్ వస్తుండటంతో తల్లిదండ్రులు చిన్నారిని ఈ నెల 10న ఆసుపత్రిలో చేర్చగా పరీక్షలు జరిపి బాలుడికి మెదడులో కుడిచేయికి అలాగే ఫేస్ కు సప్లై అయ్యే భాగంలో చిన్న గడ్డ ఉన్నట్టు గుర్తించారు. ఈ గడ్డ మెదడులోని అతి సున్నితమైన భాగంలో ఉన్నట్టు గుర్తించి దానిని వైద్య పరిభాషలో ఎపిలేపిసియా పార్షియాలిక్ కంటిన్యూ గా కనుగొన్నారు. ఇది ప్రపంచంలో అరుదుగా వచ్చే వ్యాధన్నారు. బాలుడు గత 6ఏళ్లుగా ఫీట్స్ వ్యాధికి 3 రకాల మందులు వాడుతున్నప్పటికి తగ్గలేదన్నారు. దాదాపు 3గంటలపాటు అధునాతన న్యూరో నావిగేషన్ సిస్టంతో పాటు 3డి బ్రెయిన్ మ్యాపింగా విధానం వాడి గడ్డాని తొలగించి ల్యాబుకు పంపగా బయాప్సీ పరీక్షలో న్యూరో సెస్ష్టి సీఖోలెస్ గా వచ్చిందన్నారు. సాధారణంగా ఇటువంటి వ్యాధి ఎక్కువగా పంది మాంసం తినే వారిలో వస్తుందని అలాగే కూరగాయలు శుభ్రంగా పెరగకుండా ఉండే వంటలు వల్ల కూడా ఈ వ్యాధి అతి కొద్దిమందికి మాత్రమే వస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి ఇ సజ్జలు ఇప్పటివరకు రెండు మాత్రమే జరిగాయని దేశంలో అలాగే ఎటువంటి సర్జరీ మన జిల్లాలో చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హనుమాన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో అతి కొద్ది మందికి మాత్రమే వచ్చే వ్యాధి కి తమ ఆస్పత్రిలో చికిత్స చేయడం ఆనందంగా ఉందని బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని ఈ విధమైన ఆపరేషన్కు నాలుగు లక్షల రూపాయలు ఖర్చవుతుందని తమ ఆస్పత్రిలో కేవలం లక్ష రూపాయలకు మాత్రమే ఆపరేషన్ చేసమన్నారు. మత్తు వైద్యనిపుణులు త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు