Wednesday, November 20, 2024

సంగం డైయిరీలో క్విడ్ ప్రోకో?….

సీఐడీ దర్యాప్తులో కీలక ఆధారాలు
బోనస్‌ చెల్లింపు, డీవీసీ ట్రస్ట్‌లపై లోతుగా దర్యాప్తు
డెయిరీ, ట్రస్ట్‌ల సంబంధంపై లోతుగా విచారణ
ఐదేళ్లుగా టీడీపీ నాయకుని సొసైటీకే చెల్లింపుల నిలిపివేత

గుంటూరు, : గుంటూరు జిల్లా లోని సంగం డెయిరీ పై సిఐడి విచారణ ముమ్మరమైంది. సిఐడి అధికారులు డెయిరీకి సంబంధించి వివిధ కోణాల లో దర్యాప్తుకు శ్రీకారం చుట్టారు. సిఐడి విచారణలో పాల ఉత్పత్తిదారులకు చెల్లించిన బోనస్‌తో పాటు- ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి మెమోరియల్‌ ట్రస్ట్‌లు కీలకంగా మారా యి. ఆ రెండింటి కేంద్రస్థానంగా లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్టు- సమాచారం. ప్రధానంగా డివిసి మెమోరియల్‌ ట్రస్ట్‌కు సంగం డెయిరీకి వున్న సంబంధం పై అధికారులు కూపీ లాగుతున్నారు. ట్రస్ట్‌కు సంబంధిం చిన సమాచారం వ్యక్తిగతం కావటంతో సమాచార హక్కు చట్టం క్రింద వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తు న్నారు. దీంతో పలువురు ఇంతకు ముందే కోర్టును ఆశ్రయించారు. ట్రస్ట్‌కు సంబంధించిన వివరాలన్నీ ప్రస్తుతం న్యాయస్థానం పరిశీలనలో వున్నాయి. డెయిరీ సిబ్బందితో పాటు- పాడి రైతుల కుటు-ంబాలకు అతి తక్కు వ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశం తో డివిసి మెమోరియల్‌ ట్రస్ట్‌కు అనుబంధంగా ఒక ఆసుపత్రిని ఏర్పాటు- చేశారు. కోవిడ్‌ సమ యంలోనూ ఆసుపత్రిలో బాధితులకు సేవలు అందించారు. జిల్లా అధికారులు సైతం కోవిడ్‌ చికిత్సకు ఆ ఆసుపత్రిని అను మతించారు. దీనిపై ఎవరి నుంచి ఇప్పటివరకు అభ్యం తరాలు వ్యక్తం కాలేదు. అయితే ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి స్మారక ఆసుపత్రి సంగం డెయిరీకి అనుబంధంగా నడుస్తున్నదా? లేక ధూళిపాళ్ళ నరేం ద్రకుమార్‌ కుటు-ంబ అజమాయిషీలో నడు స్తున్నదా? అనే విషయంపై అధికా రులు ప్రధానంగా దృష్టి సా రించారు. ట్రస్ట్‌ కు చెందిన డీడ్‌లో ధూళిపాళ్ళ నరేం ద్ర వంశ పారంపర్య ధర్మకర్త గా పేర్కొన్నట్టు- ప్రచారం జరుగు తున్నది. ఇది నిజ మా కాదా అనే విషయం న్యాయస్థానం ద్వారానే వెల్లడి కావలసి వున్నది. ఒకవేళ ఆ ప్రచారం నిజమ యితే ట్రస్ట్‌ పూర్తిగా ధూళిపాళ్ళ కుటు-ంబీకులకు సంబం ధించి నది గానే భావించవచ్చు. ఒకవేళ డెయిరీకి అనుబంధంగా నెల కొల్పితే డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ లేదా ఇతర అధికారులు, డైరెక్టర్‌లు ట్రస్ట్‌ లో సభ్యు లుగా వున్నారా? లేదా? అనే విష యంపై అధికారులు ప్రధానంగా దృష్టి సారిం చారు. అదేవి ధంగా సంగం డెయిరీ ఉద్యోగులు, సిబ్బంది లేదా పాడి రైతుల కుటు-ంబాలలోని వారికి ట్రస్ట్‌లో ఏమైనా ఉపాధి కల్పించారా అనే దిశగానూ అధికారులు కూపీ లాగుతున్నట్టు- సమాచారం.
రిటర్న్‌ చెక్‌లు
సంగం డెయిరీ నుంచి లాభాలకు సంబంధించిన బోనస్‌ లు జమ అయిన అనంతరం ఆ సొసైటి నుంచి డివిసి మెమోరియల్‌ ట్రస్ట్‌ పేరుతో రిటర్న్‌ చెక్కులు తీసుకుంటు-న్నట్టు- ఆరోపణలు వున్నాయి. సొసైటి స్థాయిని, దాని పరిధిలో వున్న పాడి రైతుల సంఖ్యను బట్టి వారికి వచ్చిన లాభంలో 10 నుంచి 20 శాతం వరకు చెక్కు రూపంలో వెనక్కు తీసుకుంటు-న్నట్టు- అనుమానిస్తున్నారు. ట్రస్ట్‌ కు డొనేషన్‌ రూపం లో ఎవ రైనా చెక్కులు ఇవ్వవచ్చు. అది న్యాయబద్ధమే అయినప్పటికి సొసైటి పాలక వర్గం ట్రస్ట్‌ కు చెక్కును ఇచ్చే సమయంలో దాని పరిధిలోని పాడి రైతుల అనుమతి పొందిందా? లేదా అనే విషయం సందిగ్ధంగా మారింది. దీనిపై ప్రధానంగా సి ఐ డి అధికారులు దృష్టి సారించినట్టు- చెబుతున్నారు. పాడి రైతుకు చెందాల్సిన లాభం మొత్తాన్ని ఆ రైతు అనుమతి లేకుండా వేరొకరికి డొనేట్‌ చేసే అధికారం పాలక వర్గానికి వుంటు-ందా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. డివిసి మెమోరియల్‌ ట్రస్ట్‌ డెయిరీ కి అనుబంధం గా వున్నదా? లేదా? అనే విషయాన్ని పక్కన బెడితే, పాడి రైతుల అనుమతి లేకుండా వారికి చెందాల్సిన నగదు డొనేట్‌ చేశారన్న ఆరోపణలు వెలువడు తున్నాయి. ఇందుకు సంబంధించి సి ఐ డి అధికారులు పక్కా గా ఆధారాలు సేకరించినట్టు- సమాచారం. డెయిరీ నుంచి సహ కార సంఘానికి బోనస్‌ కు సంబంధించిన చెక్కు జారీ చేసిన తేదీ, మరలా ఆ సంఘం నుంచి ట్రస్ట్‌ కు చెక్కు జారీ అయిన తేదీల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్టు- తెలి సింది. ఎక్కువ చోట్ల ఆ రెండు చెక్కులు ఒకే తేదీతో వుం డటంతో ఇదో తరహా క్విడ్‌ ప్రోకో గా అధికారులు అను మానిస్తున్నారు. సొసైటి ల నుంచి ఈ చెక్కులను ఎవరు సేకరిస్తున్నారు? అనే అంశంపైనా అధికారులు దృష్టి సారించారు.
సొసైటీ అకౌంట్‌ సీజ్‌?
సంగం డెయిరీకి పాలు సరఫరా చేసే ఒక సొసైటి అక్కౌంట్‌ ను డెయిరీ యాజమాన్యం సీజ్‌ చేసినట్టు- ఆరోపణలున్నాయి. ఆ సొసైటి కి సంబంధించి జరిగిన ఆడిట్‌ లో సాంకేతికపరంగా తలెత్తిన ఒక తప్పిదాన్ని సాకుగా చూపించి 5 సంవత్సరాల క్రితమే అక్కౌంట్‌ ను సీజ్‌ చేసినట్టు- ప్రచారం జరుగుతున్నది. అవకతవకలు జరిగిన సందర్భాల లో ఆయా సొసైటి లపై న్యాయబద్ధంగా చర్య తీసుకునే అధికా రం డెయిరీ కి వుంటు-ంది అనటంలో సందేహం లేదు. అయితే ఈ సొసైటి విషయంలో ఒక వివాదం రేకెత్తుతోంది. జిల్లాలో ఒక ప్రముఖ తెలుగుదేశం నాయకుడు ఆ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి అధ్యక్షునిగా వున్నారు. డెయిరీ యాజమాన్యం ఆ సొసైటి అక్కౌంట్‌ లు సీజ్‌ చేయటంతో, అక్కడి పాలక వర్గం వివిధ మార్గాల ద్వారా పాల ఉత్పత్తి దారులకు నగదు చెల్లిస్తు న్నట్టు- సమాచారం. డెయిరీ కి పోసే పాల పరిమా ణానికి సమా నంగా ఆ సొసైటి బయట పాల విక్ర యాలు జరుపుకోవచ్చు. ఆ విధంగా వచ్చిన కొద్ది పాటి లాభం తో పాటు- డెయిరీ నుంచి దాణా ను తీసుకెళ్లి రైతులకు ఇవ్వటం ద్వారా భర్తీ చేయగలుగుతున్నట్టు- చెబుతున్నారు. డెయిరీ యాజమాన్యం అక్కౌంట్‌ ను సీజ్‌ చేసినప్పటికీ అక్కడి నుంచి క్రమం తప్ప కుండా పాల సేకరణ జరుగుతుండటం విశేషం. అంతే గాకుం డా ఆ సొసైటి ప్రతి సంవత్సరం జమ, ఖర్చుల వివరాలను జిల్లా ఆడిట్‌ అధికారులకు అందజేస్తుం డటం విశేషం. డెయిరీ లో ఓటు-హక్కు కోల్పోకుండా వుండేం దుకే ఆ సొసైటి నియ మాలన్నీ పాటిస్తున్నట్టు- చర్చ జరుగు తున్నది.టీ-డీపీ నాయకుడు అధ్యక్షునిగా వున్న సొసైటి యాజ మాన్యం అక్కౌంట్‌ సీజ్‌ అయిన విషయాన్ని బహిర్గతం చేయ లేదు. ఒకే పార్టీకి చెందిన వారు కావటంతో పార్టీలో అంతర్గత విబేధాలు బహిర్గతం కాకూడనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదని చెబుతున్నారు.ప్రస్తుతం సి ఐ డి అధి కారులు జరుపుతున్న దర్యాప్తు తో ఈ సొసైటి అంశంపైనా దృష్టి సారించినట్టు- సమాచారం. వాస్తవానికి ఇది పూర్తిగా డెయిరీ యాజమాన్యానికి వున్న విచక్షణాధికారం అయి నప్పటికి ఆడిటింగ్‌ లో లోపాలు ఏమైనా ఉన్నాయనే విష యంపై కూపీ లాగేందుకు ఆ దిశగా దర్యాప్తుకు శ్రీకారం చుట్టినట్టు- చెబు తున్నారు. సంగం డెయిరీ ఆడిటింగ్‌ ను గుంటూరుకు చెందిన ప్రముఖ సంస్థ నిర్వహిస్తున్నది
బోనస్‌లపై దృష్టి
సంగం డెయిరీ కి ప్రస్తుతం గుంటూరు, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, విశాఖ పట్టణంల లోని పాల ఉత్పత్తిదారుల నుంచి పాలు సరఫరా అవుతున్నాయి. డెయిరీ అప్రిధిలో 582 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలతో పాటు- పలు ప్రాంతాలలో వున్న మిల్క్‌ చిల్లింగ్‌ కేంద్రాలు, ఎక్కువ పశుసంపద కలిగి నేరుగా పాలు సరఫరా చేసే వెండర్లు ఉన్నారు. సహకార సంఘాలతో కలిపి మొత్తం దాదాపు 14 వందల వరకు గుర్తింపు పొందిన పాయింట్‌ లు వున్నాయి. వాటన్నింటికి ప్రత్యేకమైన బ్యాంకు అకౌంట్‌ లు వున్నాయి. డెయిరీ కి సంబంధిం చిన లావాదేవీలు అన్నీ ఆ అక్కౌంట్‌ ల ద్వారానే జరుగుతుం టాయి. వీటి ద్వారా ప్రతి రోజూ సీజన్‌ ను బట్టి లక్ష నుంచి లక్షన్నర లీటర్ల వరకు పాల సరఫరా జరుగుతున్నది. డెయిరీ నిబంధనల ప్రకారం పాలు, పాల ఉత్పత్తుల విక్ర యం ద్వారా వచ్చే లాభాల నుంచి ప్రతి ఏటా బోనస్‌ లు పంపిణీ చేయాల్సి వుంది. డెయిరీ కి పాలు సరఫరా చేసే ప్రతి రైతు దానిలో భాగస్వామే అయినందున, లాభాలను వారందరికి పంచాల్సి వుంది. డెయిరీ కి ఏడాదికి సగటు-న 50 నుంచి 60 కోట్ల రూపా యల లాభం వస్తుంది. ఏ విధమయిన ఆరోపణలకు ఆస్కారం లేకుండా డెయిరీకి వచ్చే పాలు పరిమాణం ఆధారంగా సంబంధిత రైతుకు, వారు ప్రాతినిద్యం వహిస్తున్న సొసైటి బ్యాంకు ఖాతాకు నగదు జమచేస్తారు. ఇదంతా పక్కా గా రికార్డు పూర్వకంగా జరుగుతుంది. అయితే ఇక్కడే ఏదో మత లబు వున్నట్టు- అధికారులు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement