తెనాలి (ప్రభన్యూస్): మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరు వైద్య సేవలు పొందేందుకు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ కె.మిథునేశ్వర రెడ్డి అన్నారు. స్థానిక గంగానమ్మపేట లెక్చరర్స్ కాలనీ నందు శ్రీ చక్ర సూపర్ స్పెషాలిటీ వైద్యశాల లో ఏర్పాటు చేసిన ఉచిత ఊపిరితిత్తుువైధ్యశిభిరంలో సుమారు 300 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మారుతున్న వాతావరణ పరిస్థితులు మానవ మనుగడకు ప్రమాదం సంభవించకుండా ఉండాలంటే, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని, తగు జాగ్రత్తలతో మందులు వాడుకోవాలని అన్నారు. 50 సంవత్సరాలు పైబడిన వారు దగ్గు, ఆయాసం, జలుబు వంటి వాటి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్త్రీలు, వృద్ధులు తమకు ఏ చిన్న అనుమానం వచ్చిన తమ ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఇందుకు తక్కువ ధర నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ వైద్య శిబిరానికి వచ్చిన రోగులు తమకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా ఇచ్చిన డాక్టర్ కె.మిథునేశ్వరరెడ్డి మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈశిబిరాన్ని కమ్మెల శ్రీనివాసరరావు బి. శ్రీనివాస రావు,పి.ఆర్.ఓ. యస్.సంపత్ పర్యవేక్షించారు.