Friday, November 22, 2024

అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్స్ నుంచి కాపాడాలి..

గుంటూరు సిటీలో సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా వార్డు వాలంటీర్లకు నెలరోజుల నుంచి ఫోన్ కాల్ ద్వారా వేధింపులు మొదలయ్యాయి. గుంటూరుసిటీ వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు సచివాలయాలకు చెందిన మహిళా వాలీoటర్లను సాయి అనే వ్యక్తి టార్గెట్ చేసి వారి విలువలను తీసేందుకు వారికి తెలిసిన పలువురు వ్యక్తులకు, సాటి వాలీoటీర్లకు ఫోన్ చేసి మీరు పలానా వాలీoటీర్ కు స్నేహితులు కదా, వాళ్ళు బ్యాంక్ లో లోన్ తీసుకున్నారని చెప్పి కొద్దిసేపు వారితో ఫోన్ మాట్లాడుతూ వారిని ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడడం వంటివి చేయడంతో ఒక వాలీoటీర్ ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి నగరంపాలెం పోలీసులకు గతపదిరోజుల క్రితం పిర్యాదు కూడా చేసారు.

మహిళ ఫిర్యాదును పట్టించుకోని సిబ్బంది నిర్లక్ష్యం వలన నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు, మూడు, సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వార్డు వాలీoటీర్లు, ముఖ్యంగా మహిళా వాలంటీర్లకు ఫోన్ కాల్ వేధింపులు తప్పడంలేదు. పేరుగొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా సచివాలయాల పరిస్థితి తయారైంది. ప్రతి సచివాలయంలో ఒక మహిళా పోలీస్ సెక్రటరీ విధులు నిర్వహిస్తున్నారు. అయినా సచివాలయాల్లో సమస్యలు మాత్రం పరిష్కారం కావడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గుర్తుతెలియని, అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్స్ నుంచి మహిళా వాలీoటీర్లను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement