Tuesday, November 26, 2024

శుద్ధి చేశారు..కలుషితాన్ని అంటగట్టారు

నీటిని శుభ్రం చేసేందుకు లక్షల ఖర్చు .. వాటిని ప్రజలకు అందించే నాటికి కలుషితం

బాపట్ల టౌన్ – గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యం గురించి మంచినీరు సరఫరా చేసే అధికారులకు,కాంట్రాక్టర్లకు చీమకుట్టినట్లుగా కూడా లేదు. గ్రామాలకు సరఫరా అయ్యే ప్రధాన పైపు లైను లీకు ఏర్పడి వారం రోజులుగా గ్రామాలకు కలుషిత నీరు సరఫరా అవుతున్న అధికారులు మాత్రం పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.చివరికి శుద్ధి చేసిన నీటికి కలుషితన్ని అంటగాడుతున్నారు.కాలువల ద్వారా వచ్చే నీటిని కంకటపాలెం రహదారిలో మంచినీటి చెరువుకు నింపుకొని అక్కడి నుండి మార్పుర్రోలువారిపాలెం వాటర్ స్కీమ్ ద్వారా శుద్ధిచేసి మండల పరిధిలోని అడవి పంచాయతి,ముత్తయ్యపాలెం పంచాయతి,అసోదివారిపాలెం పంచాయతి,పడమర బాపట్ల పంచాయతిలలోని ప్రజలకు
కాంట్రాక్టర్లకు లక్షల రూపాయల అందిస్తూ వారి ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.మంచినీటి పైపులైను ఎక్కడైనా లీకేజీ ఏర్పడితే సంబంధించిన కాంట్రాక్టర్ వెంటనే లీకు అయిన ప్రాంతాన్ని గుర్తించి మరమ్మత్తులు చేయించాలి.నిత్యం నీరు సరఫరా చేసే ప్రాంతాలకు వెళ్లి నీటి సరఫరాలో ఏమైనా సమస్యలు వస్తున్నాయో లేదో చూసుకుంటూ పైపులైనులలో ఎక్కడ లీకులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.అటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడ కనిపించడం లేదు.గత వారం రోజులుగా పలు గ్రామల ప్రజలు కలుషిత నీరు వస్తుందని ప్రజలు అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడం లేదని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ నాయకుడు గుదే రాజారావు మండిపడ్డారు.వేసవి కాలంలో తాగడానికి నీరు లేక అనేక ప్రాంతాలలో ప్రజలు అల్లాడుతుంటే స్థానిక అధికారులు,నీరు సరఫరా చేసే కాంట్రాకర్లు మాత్రం ఉన్న నీటిని దుర్వినియోగం చేయడంతో పాటు,ప్రజలకు కలుషిత నిరందస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.పైపులైనులు లీకేజీ ఏర్పడిన అధికారులు మరమ్మత్తులు చేయించక పోవడం ఏమిటని ప్రశ్నించారు. స్కిం కింద అందించవల్సిన మంచినీరు ను సరిగా అందించడం లేదని,దీనితో మినరల్ వాటర్ ను కొనుగోలు చేసుకొని తగవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి పైపులైనుకు మరమ్మత్తులు చేయించి శుద్ది చేసిన నీరును సరఫరా చేయాలని కోరారు.ఈ విషయంపై ఆర్డబ్ల్యుయస్ ఏఇ బాషా ను వివరణ కోరగా పైపులైను లికేజు విషయం సోమవారం తన దృష్టికి వచ్చిందని సంబంధించిన కాంట్రాక్టర్ ద్వారా వెంటనే మరమ్మత్తులు చేయించి మంచినీరు అందిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement