బీజేపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మధ్య ఘర్షణలు
పలుచోట్ల పోలింగ్‌కు ఆటంకం
పొనుగోడులో బ్యాలెట్ బాక్సును నీళ్లతొట్టిలో పడేసిన ఏజెంట్
పరస్పరం రాళ్లు రువ్వుకున్న రెండు వర్గాలు
మూడు కేంద్రాల్లో రీపోలింగ్
చిత్తూరు జిల్లాలో అనేక చోట్ల ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు
పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్ శాతం
అమరావతి, : రాష్ట్రంలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. కొన్ని చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం గా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన ఎన్నికల్లో 60.91 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఇటీవల జరి గిన పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 68.27 శాతం, అతిస్వల్పంగా ప్రకాశం జిల్లాలో 51.68 శాతం నమోదైంది. రాష్ట్రం లోని 13 జిల్లాల పరిధిలో 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానా లకు జరిగిన ఎన్నికల్లో 20,840 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందుకోసం 33,663 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొ వడానికి పోటీ పడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలలో స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి రాళ్లు రువ్వు కున్నారు. దీంతో పలువురికి గాయాలవడం, బీజేపీ ఏజెంట్ బ్యాలెట్ బాక్సును సమీపంలోని నీళ్ల తొట్టెలో పడేశారు. దీంతో ఆ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్‌కు అధికారులు ఆదేశాలిచ్చారు. అలాగే చిత్తూరు జిల్లాలోని గడిపాలమండలంలో వేపలమానుచెరువు గ్రామ స్తులు ఎన్నికలను బహిష్కరించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ ప్రాంతాల్లో కూడా జనసేన, వైసీపీ నేతల మధ్య స్వల్ప వివాదం ఉద్రిక్త పరిస్థి తికి దారి తీసింది. ఇలా స్వల్ప చెదురు మదురు సంఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ పోరు ప్రశాంతంగా ముగిసింది.
చెదురుమదురు సంఘటనలు మినహా.. ఎన్నికలు ప్రశాంతం
రాష్ట్రంలో గురువారం జరిగిన పరిషత్ పోరులో అనేక ప్రాంతాల్లో చెదురుమదురు సంఘ టనలు జరిగాయి. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బలగాలను ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల మధ్య చోటుచేసుకున్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఘర్షణకు దారితీసింది. నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం పొనుగోడు పోలింగ్ కేంద్రంలో బీజేపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య ఓటు వేసే విషయంలో మాటామాటా పెరి గింది. ఓ వృద్దుడు రెండవసారి ఓటు వేయడానికి వచ్చాడనే విషయంపై ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో బీజేపీ ఏజెంటు వైసీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సం దర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసు కుంది. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఘర్షణకు ముందు బీజేపీ ఏజెంట్లు బ్యాలెట్ బాక్సును సమీపంలోని నీటి ట్యాంకులో పడేశారు. దీంతో వివాదం మరింత పెద్దదైంది. అదేవిధంగా బోగోలు మండలం తెల్లగుంట గ్రామంలో ఎన్నికలను బహిష్క రించారు. మూడు రోజులుగా ఖాళీ బిందె లతో నిరసన తెలుపుతూ నీటి సమస్యను పాలకుల దృష్టి కి తీసుకెళ్లినా పరిష్కరించలేదని వారు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండల పరిధిలోని సామర్రు, గున్నేపల్లి పోలింగ్ కేంద్రాల పరిధిలో ఘర్షణలు జరిగాయి. బ్యాలెట్ పేపర్‌పై జనసేన గుర్తు లేకపోవడంతో ఆ పార్టీకి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో కొంతసేపు ఆ కేంద్రంలో పోలింగ్ నిలిచిపోయింది. అలాగే చిత్తూ రు జిల్లాలోని గుడిపాల మండలం వేపలమానుచె రువు పరిధిలో గ్రామస్తులు ఎన్నికలను బహిష్క రించారు. గ్రామంలో అభివృద్ది పనులు జరగడం లేదని ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లా పరిధి లో మరో మూడు ప్రాంతాల్లో ఎన్నికలను బహిష్కరించారు.
మూడు కేంద్రాలలో రీపోలింగ్
ఘర్షణలు, వివాదాలు, వివిధ కారణా లతో రాష్ట్రంలోని మూడు పోలింగ్ కేంద్రాలలో గురువారం ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో ఆ కేంద్రాలలో నేడు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లాలోని సీతానగరం మండలం అంతిపేట ఎంపీటీసీ స్థానా నికి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం చౌటభీమవరం ఎంపీటీసీ స్థానానికి, వెస్ట్ గోదావరి జిల్లా ఐలవరం మండలం సూరంపూడి ఎంపీటీసీ స్థానానికి సంబంధించి ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో వివాదం చోటుచేసుకున్న కేంద్రా లలో రీపోలింగ్‌కు ఆదేశించారు.
పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్ శాతం
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల తో పోలిస్తే గురువారం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా తగ్గింది. ఫిబ్రవరి నెలలో నాలుగు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్ని కల్లో రాష్ట్రవ్యాప్తంగా 82.27 శాతం పోలింగ్ నమోదు కాగా.. తాజాగా జరిగిన పరిషత్ పోరులో 60.91 శాతం మాత్రమే నమోదైంది. సుమారు 21.50 శాతం పోలింగ్ తగ్గింది. అందుకు బలమైన కారణాలు లేకపోలేదు. కోర్టు కేసుల నేపథ్యంలో ఎన్నికలు వాయిదాపడిన 24 గంటలు తిరగకముందే ఎన్నిక లకు పచ్చజెండా ఊపడం, కీలకమైన పరిషత్ పోరును ప్రధాన ప్రతిపక్షం బహిష్కరించడం తదితర కారణాలు వెరసి జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది.
వ. నెం. జిల్లా పేరు పోలింగ్ శాతం
- శ్రీకాకుళం 58.37
- విజయనగరం 67.13
- విశాఖపట్నం 65.25
- పశ్చిమగోదావరి 68.27
- తూర్పుగోదావరి 63.07
- కృష్ణా 63.99
- గుంటూరు 57.25
- ప్రకాశం 51.68
- నెల్లూరు 53.52
- చిత్తూరు 61.34
- కడప 63.59
- కర్నూలు 60.28
- అనంతపురం 58.07
సరాసరి 60.91