అమరావతి, : మాస్క్ లేకుండా బయటకు వచ్చారా పోలీసులకు బుక్అయినట్టే. భారీ జరిమానాతో పాటు అంటు వ్యాధుల చట్టం కింద కేసులు ఎదుర్కొనే ప్రమాదం పొంచిఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లి భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మాస్క్ ధరించకుండా తిరిగేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. అంతేకాకుండా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు కూడా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ మాస్క్ ధరించని వారికి భారీగా జరిమానాలు విధిస్తోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, బస్సులు, ఇతర వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. గడిచిన రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 30వేల మందికి పైగా జరిమానాలు విధించారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులే వాహనదారులకు మాస్క్‌లు అందిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు మాస్క్ ధరించకుండా వాహనదారులు వెళ్తుంటే వారి ఫోటోలను సైతం తీస్తూ ఈ-చలాన్లను జారీ చేస్తున్నా రు. మరోవైపు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూడా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా వాహనాలను గుర్తిస్తూ ఫైన్ విధిస్తున్నారు. ఇంకోకవైపు రాష్ట్రంలో మళ్లి కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కలిగిస్తున్నారు. మొదటిసారి మాస్క్ ధరించకుండా పట్టుబడిన వారికి రూ. 250 నుంచి రూ.500 వరకు ఫైన్ విధిస్తున్నారు. ఈ నెల 28 నుంచి మాస్క్ డ్రైవ్‌ను పోలీస్ ప్రారంభింంది. తొలి రోజే మాస్క్ లేకుండా ఇష్టానుసారంగా రోడ్లపై సంచరిస్తున్న 18565 మందికి భారీగా జరి మానా విధించారు.
ఒక్కరోజులో రూ. 17.34 లక్షల ఫైన్‌ను పోలీస్ శాఖ విధించిందంటే ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో స్పష్టమౌతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో ఫైన్లు విధిస్తున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం భారీగా జరిమానాలు వేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు మరోసారి అమలు నోచుకుంటున్నాయి.
ప్రజలు, వాహనదారులు చివరికి పాదచారులు సైతం విధిగా మాస్క్‌లు ధరిస్తున్నారు. ఇప్పటి వరకు పక్కకు పడేసిన మాస్క్‌లను తిరిగి స్వచ్ఛందంగా ధరిస్తూ.. కోవిడ్ నిబంధనలను కొంత వరకు పాటిస్తున్నారు. రెండోసారి మాస్క్ లేకుండా పట్టుబడితే భారీగా జరిమానా తప్పదని పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది. అవసరమైతే అంటువ్యాధుల చట్టం కింద కేసులు తప్పదని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
పోలీసుల కౌన్సెలింగ్
మాస్క్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో వివరిస్తున్నారు. ఒకరి నుంచి మరోకరికి వ్యాప్తి చెందే ఈ వైరస్ కుటుంబాలను హరించే ప్రమాదం ఉందని తప్పని సరిగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులతో కలిసి ప్రయాణిస్తున్న వారిని ఆపుతూ తగిన జాగ్రత్తలు చెప్తున్నారు.అంతేకాకుండా మాస్క్‌లు ఉచితంగా ఇస్తున్నారు. మరోవైపు పాఠశాల లు, కళాశాలలు, బస్టాండ్లు, రద్దీ కూడళ్లు, షాపింగ్ మాల్స్‌పై కూడా పోలీస్ యంత్రాంగం దృష్టి సారించింది. బస్టాండ్‌లోకి ప్రవేశించాలన్న, ప్రయా ణం చేయాలన్న మాస్క్ తప్పనిసరి అన్న నిబంధనలు అమలులోకి తెచ్చాయి. షాపింగ్ మాల్స్ యాజమా న్యాలకు మాస్క్ లేకుండా ఎవరిని అనుమతించవద్దని సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కళాశాలలు, పాఠశాలలో కూడా కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో విద్యా శాఖతో పాటు పోలీస్ శాఖ తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది.
పెరిగిన మాస్క్‌ల విక్రయాలు
గత కొద్ది నెలలుగా మాస్క్‌ల విక్రయాలు చాలా స్వల్ప స్థాయికి పడిపోయాయి. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలకు దిగడంతో ఇప్పుడు మాస్క్‌ల విక్రయాలు ఊపం దుకున్నా యి. పోలీసులు జరిమానా విధిస్తారన్న భయంతో ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరిస్తున్నారు. దీంతో కళ వాడిన మాస్క్‌ల దుకాణాలు మళ్లి రద్దీగా మారా యి. బస్సులతో పాటు ఇతర భారీ వాహనాలు, కా ర్లు, మోటర్ బైక్‌లు వినియోగిస్తున్న వారంతా పోలీ సుల ఆంక్షలతో క్రమంగా దారిలోకి వస్తున్నారు.