అమరావతి – ఇసుక టెండర్లపై ప్రతిపక్షాలు రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారరెడ్డి ఆరోపించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,అర్హత ఉంటే మీరెందుకు టెండర్లలో పాల్గొనలేదని విపక్షాలను నిలదీశారు . రూ.120 కోట్లు డిపాజిట్ చేసిన కంపెనీ నష్టాల్లో ఎలా ఉంటుందని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా టెండర్లు నిర్వహించి సెక్యూరిటీ డిపాజిట్ చేసిన కంపెనీ దివాళా తీసిందనడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇసుక టెండర్ విధానంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని, వినియోగదారులకు సులభంగా, తక్కువ ధరకే నాణ్యమైన ఇసుకను అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు . టీడీపీ హయాంలో ఇసుకలో లక్ష కోట్ల దోపిడీ జరిగిందన్నారు. తమ ప్రభుత్వం ఇసుక సరసమైన ధరలకు విక్రయించాలని కమిటీ నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ద్వారా టెండర్లు పిలిచామన్నారు. దాదాపు రూ.125 కోట్లు బిడ్లు తీసుకొని అర్హత ఉన్న వారికి కేటాయించామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు టెండర్లను మోసం, దగా అంటున్నారని,. ఆరోపణలు చేసేవారు టెండర్లలో పాల్గొనవచ్చు కదా అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement